DISTRICTS

ప్రతి విద్యార్ధి స్వచ్ఛందంగా ఎన్నికల నిర్వహణలో పాల్గొన్నడం అభినందనీయం-కలెక్టర్

వెబ్ కాస్టింగ్ ప్రక్రియ..

నెల్లూరు: జిల్లాలో ఈ నెల 13వ తేదీన జరగనున్న పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వెబ్ కాస్టింగ్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చక్రధర్ బాబు, ఇంజినీరింగ్ విద్యార్ధులకు సూచించారు.గురువారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో  వెబ్ కాస్టింగ్ ప్రక్రియ పై ఏర్పాటుచేసిన శిక్షణా కార్యక్రమంలో జిల్లాఎన్నికల అధికారి చక్రధర్ బాబు పాల్గొని మాట్లాడుతూ వెబ్ కాస్టింగ్ ప్రక్రియలో పాల్గొను ప్రతి విద్యార్ధి స్వచ్ఛందంగా ఎన్నికల నిర్వహణలో పాల్గొండటం సంతోషకరమని, కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ మొదలు అయినప్పటి నుండి పూర్తి అయ్యేంతవరకు వెబ్ కాస్టింగ్ ప్రక్రియ చేపట్టాల్సి వుంటుందన్నారు. ఈ నెల 13వ తేదీన ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమౌతుందని, పోలింగ్ పూర్తి అయ్యేంత వరకు పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ప్రక్రియ ద్వారా లైవ్ కాస్టింగ్ ను ఎలాంటి అంతరాయం కల్గకుండా నిర్వహించాలని విద్యార్ధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా  రెవెన్యూ అధికారి శ్రీమతి వెంకట నారాయణమ్మ, వెబ్ కాస్టింగ్ నిర్వహణ నోడల్ అధికారి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ.ఈ రాజశేఖర్, ఇంజినీరింగ్ విద్యార్దులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *