INTERNATIONAL

పాకిస్తాన్ లోని మసీదులో పేలుడు-46 మంది మృతి

అమరావతి: ఆర్దిక మాంద్యతో ఆహార వస్తువులు దొరకక పోవడంతో పలు ఇబ్బందులు పడుతున్న పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మాత్రం చేలరేగిపోతున్నారు..సోమవారం పెషావర్‌లోని ఓ మసీదు వద్ద జరిగిన పేలుడులో సుమారు 46 మంది మరణించగా మరో 100 మంది తీవ్రంగా గాయపడ్డారు..వీరిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని పోలీసులు పేర్కొన్నారు..హై సెక్యూరిటీ వున్న ఈ ప్రాంతంలోని మసీదులో ప్రార్థనల కోసం భారీ సంఖ్యలో ప్రజలు చేరుకున్న సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు తెలిపారు..పోలీసు అధికారి సికందర్ ఖాన్ మీడియాకు తెలిపారు..  మసీదు వద్ద జరిగిన పేలుడులో సుమారు 46 మంది మరణించారని,,100 తీవ్రంగా గాయపడ్డారని, వీరికి ఆసుపత్రులకు తరలించి, చికిత్స చేయిస్తున్నామని చెప్పారు..మసీదు భవనంలోని ఓ భాగం కుప్పకూలిపోయిందని, శిథిలాల క్రింద కొందరు చిక్కుకుని ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు..పోలీస్ చీఫ్ ముహమ్మద్ ఇజాజ్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ, ఈ మసీదు ఆఫ్ఘనిస్థాన్ సమీపంలో ఉందని,,ఈ ఘటనకు పాల్పపడిన వారి కోసం దర్యాప్తు బృందాలు విచారణ కొనసాగిస్తున్నయని వెల్లడించారు.

Spread the love
venkat seelam

Recent Posts

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

13 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

15 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

19 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

19 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

23 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

2 days ago

This website uses cookies.