AMARAVATHINATIONAL

అవినితిలో ఫస్ట్-ఆర్ధిక నిర్వహణ లాస్ట్-ఎన్డీఏతోనే అభివృద్ది సాధ్యం-ప్రధాని మోదీ

అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం..

అమరావతి: లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ చేతులు ఎత్తి వేసింది…5 సంవత్సరాలను వైసీపీ వృథా చేసింది.. అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటల తూటాలు పేల్చారు.. ఏపీలో అభివృద్ధి శూన్యం..అవినీతిలో నెంబర్‌వన్‌ అంటూ తీవ్ర స్థాయిలో విరుకుపడ్డారు.. సోమవారం రాజమండ్రిలోని వేమగిరి నిర్వహించిన ప్రజాగళం సభలో జనసేనాని పవన్ కళ్యాణ్,,లోకేష్ లు పాల్గొన్నారు..ఈ సందర్భంగా ప్రధాని మోదీ, పలు కీలక వ్యాఖ్యలు చేశారు..10 సంవత్సరాల యూపీఏ పాలన అంతా స్కామ్‌ల మయమని విమర్శించారు.. ఎన్డీఏ పాలన వస్తేనే ఆంద్రప్రదేశ్ లో అభివృద్ధి సాధ్యమన్నారు..అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తామని ప్రధాని హెచ్చరించారు..వైసీపీ ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిందని,, అయితే ఇప్పుడు ప్రభుత్వమే లిక్కర్‌ వ్యాపారం చేస్తోందంటూ నిశితంగా విమర్శించారు..ఆంద్రప్రదేశ్ లో మద్యం మాఫియా, ఇసుక మాఫియాల రాజ్యం నడుస్తోందని,,అవినీతిలో దూసుకుని పోతున్న వైసీపీ ప్రభుత్వం,, అభివృద్ధిలో మాత్రం వెనుక పడిపోయిందన్నారు..మూడు రాజధానులు నిర్మిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఒక్క రాజధాని కూడా ఇవ్వలేదన్నారు..మూడు రాజధానుల పేరిట దొపిడీ చేద్దామనుకున్నారని,, కానీ ఖజానా ఖాళీ అయిందంటూ వ్యాఖ్యనించారు..అవినీతికి పాల్పపడడంలో ముందు వున్న వీళ్లు ఆర్ధిక నిర్వహణ మాత్రం చేయలేరంటూ విమర్శించారు..ఏపీకి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టుకు బ్రేకులు వేశారంటూ మండిపడ్డారు..కేంద్రం ఈ ప్రాజెక్టు కోసం 15వేల కోట్లు ఇచ్చిందని కానీ రాష్ట్రప్రభుత్వం ముందుకు వెళ్లనివ్వడంలేదన్నారు..జూన్‌ 4 తరువాత ఎన్డీఏ ప్రభుత్వం ఇలాంటి సమస్యలను పరిష్కరిస్తుందని,, ఎన్డీఏ పాలనతోనే అభివృద్ధి సాధ్యం అని పేర్కొన్నారు..

జార్ఖండ్ లో నోట్ల గుట్టలు:- జార్ఖండ్ లోని ఓ మంత్రి ఇంట్లో లభించిన నగదుపై కూడా ప్రధాని మోదీ మాట్లాడుతూ పక్క రాష్ట్రమైన జార్ఖండ్‌లో నోట్ల గుట్టలు బయటపడ్డాయని,, అక్కడ దొంగసొత్తును మోదీ పట్టుకుంటున్నారని జనం అంటున్నారన్నారు.. ఈ దొంగతనాన్ని, అక్రమ సంపాదనను, దోపిడీని బట్టబయలు చేస్తే,, నా పైన దుమ్మెత్తి పోస్తారని,,ఎవరేమి అనుకున్నా,, దొంగ సొమ్మును మాత్రం బయటకు తీస్తామన్నారు..కేంద్రం ప్రజలకు పంపిన ఒక్క పైసా కూడా ఎవరినీ తిననివ్వను అని అ సోమ్ము పేదలకు చేరాల్సిందే అని అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *