NATIONAL

నాగాలాండ్ తొలి మహిళ ఎమ్మేల్యేగా చరిత్ర సృష్టించిన హెకానీ జఖాలు

అమరావతి: నాగాలాండ్ రాష్ట్ర హోదా పొందిన 60 ఏళ్ల తరువాత సరికొత్త అధ్యాయం న్యాయవాది, సామాజిక కార్యకర్త  అయిన హెకానీ జఖాలు (48) సృష్టించారు..తొలిసారి ఓ మహిళా ఎమ్మెల్యే నాగాలాండ్ అసెంబ్లీలో అడుగిడనున్నారు.. ఎన్నికల్లో పోటీ చేసిన మొత్తం 183 మంది అభ్యర్థుల్లో నలుగురు మహిళలు ఉన్నారు.. NDPP అభ్యర్థిగా బరిలో నిలిచిన ఈమె,,దిమాపుర్‌ స్థానం నుంచి 1,536 ఓట్ల ఆధిక్యంతో లోక్ జనశక్తి పార్టీకి చెందిన అజితో జిమోమినిపై విజయం సాధించారు..పశ్చిమ అంగామి స్థానంలో NDPPకి చెందిన మరో మహిళా అభ్యర్థి సల్హౌతునొ క్రుసో కూడా అధిక్యంలో ఉన్నారు.. 1963లో నాగాలాండ్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా లభించింది..అప్పటినుంచి ఈశాన్య రాష్ట్రంలో 13 సార్లు శాసనసభ ఎన్నికలు జరిగాయి..అయితే ఇప్పటివరకు ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టిన దాఖలాలు లేవు.. రాష్ట్రంలో మొత్తం 13.17లక్షల మంది ఓటర్లు ఉండగా, అందులో దాదాపు సగం 6.56లక్షల మంది మహిళా ఓటర్లే ఉన్నారు..ఇప్పటి వరకు అక్కడ జరిగిన మొత్తం అసెంబ్లీ ఎన్నికల్లో 20 మంది మహిళలు మాత్రమే పోటీ చేసి పరాజయం పొందారు..NDPPతో కలిసి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

Spread the love
venkat seelam

Recent Posts

12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగానికి అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…

56 seconds ago

క్రేజీ వాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు

అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్‌పై…

3 mins ago

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

1 day ago

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

1 day ago

టీవీ న‌టి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు అంటూ ట్రెడింగ్ అవుతున్న పోస్టు

అమరావతి: కర్ణాటకలో ఇటీవ‌లే ఎం.పీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ స్కాండ‌ల్ ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో…

1 day ago

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు…

1 day ago

This website uses cookies.