AMARAVATHI

నారాయ‌ణని భ‌య‌పెట్టాల‌నుకుంటే,మరింత కష్టపడి పనిచేస్తారు-జనరల్ మేనేజర్

నోటీసులివ్వండి క్లారిటీ ఇస్తాం...

నెల్లూరు: నారాయ‌ణ విద్యా సంస్థ‌ల‌పై పోలీసులు ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశాన్ని నారాయణ గ్రూప్ జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డితో క‌లిసి ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు.ఇటీవల నారాయణ విద్యా సంస్థ‌ల్లో డ్ర‌గ్స్ ఉన్నాయ‌ని..వాటి కోసం విద్యా సంస్థ‌ల్లో..ఉద్యోగస్తుల ఇళ్ల‌ల్లో సోదాలు చేశారని మండిపడ్డారు..తెలుగుదేశం నాయకులను భ‌య‌బ్రాంతుల‌కు గురి చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌ని వైసీపీ నాయ‌కుల‌ను హెచ్చరించారు..92 బస్సులు కొనుగోలు చేసిన మాట వాస్త‌వ‌మేన‌ని, మా విద్యా సంస్థ‌ల చైర్మ‌న్‌, నారాయ‌ణ అల్లుడు పునీత్ చెబుతూనే ఉన్నార‌న్నారు. ఒక స్కూల్‌కి బస్సు ర‌న్ చేయాలంటే,,ఎడ్యుకేష‌న‌ల్ పేరుతో రిజిస్ట్రేష‌న్ చేయాల‌న్నారు..ఎడ్యుకేష‌న్ యాక్ట్,,రవాణా.శాఖ నిబంధనల ప్ర‌కారం వుంటుందన్నారు..నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు పై రిజిస్ట్రేషన్ చేసి పన్ను ఎగ్గొట్టారని,,.రూ.10 కోట్ల.కు పైగా పన్ను చెల్లించాల్సి ఉందని ఆరోపించారన్నారు…రూ.22లక్షల 35 వేలు మాత్రమే ట్యాక్స్ చెల్లించారని,,ఒక వేళ అలా జరిగి వుంటే ఇందుకు రవాణశాఖాధికారులు నోటీసులు ఇవ్వలన్నారు.. ఈ విషయంను సాకు చూపించి,,ఉదయం 5 గంట‌ల నుంచే టీడీపీ నాయ‌కుల‌పై, విద్యా సంస్థ‌లు,, ఎంప్లాయిస్‌పైన‌…వ్యాపార‌స్తుల‌ ఇళ్లపైన పోలీసులు సోదాలన పేరుతో దాడులు చేయడం దారుణమన్నారు.. టీడీపీ మ‌హిళ‌ల‌ నాయకురాలు ఇంటికి దౌర్జ‌న్యంగా బెడ్ రూమ్ లో పోలీసులు సోదాలు చేయ‌డం దారుణ‌మ‌న్నారు..

 సొసైటీ పేరుతో కూడా లీజుకి ఇచ్చామ‌ని మేమే చెబుతున్నామ‌న్నారు. నోటీసులు ఇస్తే…దానికి మేము క్లారిటీ ఇస్తామ‌ని చెప్పారు. ఒక వేళ ట్యాక్స్ పే చేయాలంటే ఈ క్ష‌ణ‌మే పే చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.. నెల్లూరులో వైసీపీ ఖాళీ అయిపోతుంద‌న్న భ‌యంతో. ఇలాంటి దుర్మార్గ‌పు చ‌ర్య‌లు పాల్ప‌డ‌డం సిగ్గుచేట‌న్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

పీఠాపురం చేరుకున్న సురేఖ,రామ్‌ చరణ్-పవన్ కల్యాణ్ ని గెలిపించండి

అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…

2 hours ago

ఓటరు అసిస్టెంట్‌ బూత్‌ల ఏర్పాటు-మే 13న పోలింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు-కలెక్టర్‌

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్‌…

2 hours ago

12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగానికి అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…

22 hours ago

క్రేజీ వాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు

అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్‌పై…

22 hours ago

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

2 days ago

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

2 days ago

This website uses cookies.