DISTRICTS

లింగ నిర్దార‌ణ పరీక్షలు చేస్తే,క‌ఠిన చ‌ర్య‌లు-క‌లెక్ట‌ర్

నెల్లూరు: గ‌ర్భ‌స్థ లింగ నిర్దార‌ణ నేర‌మ‌ని, దీనికి పాల్ప‌డిన‌వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు,  వైద్యాధికారులను ఆదేశించారు. శుక్ర‌వారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో డిస్టిక్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రొప్రియెట్ అధారిటీ మీటింగ్ ఆన్ PC & PNDT చ‌ట్టం-1994,  ART, స‌రోగ‌సీ చ‌ట్టం అమ‌లుపై  కలెక్టర్, సంబంధిత క‌మిటీ అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. జిల్లాలో జ‌రుగుతున్న‌ గ‌ర్భ‌స్థ లింగ‌నిర్దార‌ణ ప‌రీక్ష‌లు, స్కానింగ్ సెంట‌ర్ల ప‌నితీరుపై క‌లెక్ట‌ర్‌ ఆరా తీశారు. స్కానింగ్ సెంట‌ర్ల‌పై నిరంత‌రం నిఘా ఉంచాల‌ని, రికార్డుల‌ను త‌నిఖీ చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. లింగ నిర్ధార‌ణ చేయాల‌ని అడ‌గ‌డం కూడా చ‌ట్ట‌వ్య‌తిరేక‌మేన‌ని స్ప‌ష్టం చేశారు. వివిధ కార‌ణాల‌వ‌ల్ల‌ ఇటీవ‌ల కాలంలో స‌రోగ‌సీ విధానం కూడా వ్యాప్తి చెందుతోంద‌ని, దీనిపైనా నిఘా ఉంచాల‌ని సూచించారు. సంబంధిత శాఖలను సమన్వయం చేసుకుంటూ గ‌ర్భ‌స్థ లింగ నిర్ధార‌ణ జ‌ర‌గ‌కుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటూనే, మ‌రోవైపు పూర్తి స్థాయిలో అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌ని, పెద్ద ఎత్తున ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టాల‌ని జిల్లా కలెక్టర్, వైద్యాధికారులను ఆదేశించారు. వైద్యాధికారులు కుటుంబ నియంత్రణ పై ప్రత్యేక దృష్టి సారించాలని,  ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో వైద్యాధికారులు, స్వచ్చంద సంస్థలు అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌ని కలెక్టర్ సూచించారు.

Spread the love
venkat seelam

Recent Posts

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

13 hours ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

18 hours ago

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

2 days ago

తిరుపతి,అనంతపురం, పల్నాడు జిల్లాలకు కొత్త కలెక్టర్,ఎస్పీలు

FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…

2 days ago

ఖాళీ బాటిల్, క్యానులలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌‌లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…

2 days ago

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

2 days ago

This website uses cookies.