INTERNATIONAL

ఐక్యరాజ్య సమితి వేదికగా, ఉగ్రవాదంను ప్రొత్సహిస్తున్న పాక్ పై తీవ్రంగా మండిపడిన భారత్

అమరావతి: ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వేదికగా ముంబై ఉగ్రదాడికి కారణం ఎవరంటూ ఐరాసలో భారత శాశ్వత బృందం ప్రతినిధి,తొలి కార్యదర్శి మిజిటో వినిటో ప్రశ్నించారు.శుక్రవారం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వేదికగా మిజిటో వినిటో మాట్లాడుతూ, పాకిస్థాన్ ప్రధాని తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాశ్మీర్ సమస్యపై షెహబాజ్ చేసిన వ్యాక్యలన్నీ అబద్దాలని,అంతర్జాతీయ వేదికగా పాకిస్థాన్ భారత్ పై ఆరోపణలు చేయడానికి ప్రాధాన్యతనివ్వడం దురదృష్టకరమన్నారు. 1993 ముంబై పేలుళ్ల కారణం అయిన ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంకు పాకిస్థాన్ ఆశ్రయం ఇస్తోందని,శాంతిని కోరుకుంటున్నామని చెబుతున్న పాకిస్థాన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సొంత దేశంలోని సమస్యలు చెప్పకుండా, భారత్ కు వ్యతిరేకంగా షెహబాజ్ మాట్లాడుతున్నారని మిజిటో మండిపడ్డారు.పొరుగు దేశాలతో శాంతిని కోరుకుంటున్నానన్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, టెర్రరిజాన్ని ఎందుకు స్పాన్సర్ చేస్తున్నారో చెప్పాలన్నారు.

పాక్ ప్రధాని:- అంతకుముందు ఐరాస జనరల్ అసెంబ్లీలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ, భారత్ సహా అన్ని పొరుగు దేశాలతో శాంతిని ఆకాంక్షిస్తున్నామని చెప్పారు. దక్షిణాసియాలో సుస్థిరమైన శాంతి, స్థిరత్వం అనేది జమ్మూ కశ్మీర్ వివాదానికి న్యాయమైన, శాశ్వతమైన పరిష్కారంపై ఆధారపడి ఉంటుందన్నారు. జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ 2019లో భారత్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో శాంతి ప్రక్రియకు విఘాతం కలిగిందని చెప్పారు.

Spread the love
venkat seelam

Recent Posts

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

3 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

3 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

7 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

1 day ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

1 day ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

1 day ago

This website uses cookies.