NATIONAL

50వ సీజేఐ ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ ధనంజయ్ వై.చంద్రచూడ్

అమరావతి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ్ వై.చంద్రచూడ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో సుప్రీమ్ కోర్టు 50వ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్‌తో ప్రమాణం చేయించారు. సీజేఐగా ఆయన 2024 నవంబరు 10 వరకు సేవాలు అందించనున్నారు.జస్టిస్ చంద్రచూడ్ సుప్రీంకోర్టులో చాలా కాలంగా పని చేస్తున్నారు.ప్రమాణస్వీకారం అనంతరం జస్టిస్ చంద్రచూడ్ మీడియాతో మాట్లాడుతూ, మాటలతో కాదు పని తీరుతోనే ప్రజలకు విశ్వాసం కల్పిస్తానన్నారు. టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకుంటామని, సుప్రీంకోర్టులో అన్ని అంశాల్లో సంస్కరణలు ప్రవేశ పెడతామన్నారు.జస్టిస్ ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ 1959 నవంబర్ 11న జన్మించారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి ఆర్థికశాస్త్రంలో BA ఆనర్స్ చేసారు. ఆటు తరువాత ఢిల్లీ యూనివర్సిటీలోని క్యాంపస్ లా సెంటర్ నుంచి LLB చేశారు.USAలోని హార్వర్డ్ లా స్కూల్ నుంచి ఫోరెన్సిక్ సైన్స్ లో LLM, డాక్టరేట్ పొందారు. చంద్రచూడ్ తండ్రి యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ దాదాపు 7 సంవత్సరాల నాలుగు నెలల పాటు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.ఇది సుప్రీంకోర్టు చరిత్రలో సుదీర్ఘమైన సీజేఐ  పదవీకాలం.

Spread the love
venkat seelam

Recent Posts

ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది-ద్వారకా తిరుమలరావు

సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…

22 mins ago

పీఠాపురం చేరుకున్న సురేఖ,రామ్‌ చరణ్-పవన్ కల్యాణ్ ని గెలిపించండి

అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…

3 hours ago

ఓటరు అసిస్టెంట్‌ బూత్‌ల ఏర్పాటు-మే 13న పోలింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు-కలెక్టర్‌

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్‌…

4 hours ago

12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగానికి అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…

24 hours ago

క్రేజీ వాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు

అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్‌పై…

24 hours ago

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

2 days ago

This website uses cookies.