AMARAVATHI

నెక్లెస్ రోడ్డు దుస్సుస్థితిని చూసి వైసీపీ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డ నారాయ‌ణ‌

అధికారంలోకి రాగానే నెక్లెస్ రోడ్డు పూర్తి చేస్తా..

నెల్లూరు: న‌గ‌రంలోని శ్రీ ఇరుక‌ళ‌ల ప‌రమేశ్వ‌రి అమ్మ‌వారి ఆల‌యం వ‌ద్ద ఉన్న‌ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డును మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌,,డిప్యూటీ మేయ‌ర్, రూప్‌కుమార్ తో క‌లిసి గురువారం ప‌రిశీలించారు..ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ నెల్లూరు ప్ర‌జ‌లకు ఆహ్లాదం క‌లిగించేందుకు  హైద‌రాబాద్ త‌ర‌హాలో ట్యాంక్ బండ్ నిర్మించాల‌ని త‌లంచి ఆ మేర‌కు ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని చెప్పారు..2014 నుంచి 2019 వ‌ర‌కు టీడీపీ హ‌యాంలో ఫ‌స్ట్ ఫేజ్ కింద నెల్లూరు స్వ‌ర్ణాల చెరువు వ‌ద్ద ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు ప‌నులు దాదాపు పూర్తి చేశామ‌న్నారు. అయితే మిగిలిన ప‌నులు పూర్తి చేసేలోపు ఎల‌క్ష‌న్ రావ‌డంతో టీడీపీ ప్ర‌భుత్వం మారింద‌న్నారు.అనంత‌రం అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ నెక్లెస్ రోడ్డు విష‌యాన్ని పూర్తిగా గాలికి వ‌దిలేసి నెల్లూరు ప్ర‌జ‌ల‌కి ఆహ్లాదాన్ని దూరం చేసింద‌ని మండిప‌డ్డారు. ఈ ప‌నులు ఎక్క‌డ పూర్తి చేస్తే టీడీపీకి మంచి పేరు వ‌స్తుందోనని అస‌లు ఆ విష‌యాన్ని మ‌రుగ‌న పెట్టార‌ని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. త్వ‌ర‌లో జరగనున్న ఎన్నిక‌ల్లో టీడీపీ ప్ర‌భుత్వాన్ని మ‌ళ్లీ గెలిపిస్తే ఆగి పోయిన పనుల‌ను పూర్తి చేసి, నెక్లెస్ రోడ్డును నెల్లూరుకే త‌ల‌మానికంగా తీర్చిదిద్దుతాన‌ని హామీ ఇచ్చారు.

Spread the love
venkat seelam

Recent Posts

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

4 mins ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

9 mins ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

2 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

23 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

1 day ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

1 day ago

This website uses cookies.