AMARAVATHI

‘‘రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ తరువాత ప్రధాని మోదీ గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోయింది,తగ్గించాలి-రైతు నాయకుడు

వీళ్లు నిజమైన రైతులా?

అమరావతి: రైతులు తమ సమస్యలను పరిష్కరించడంతో పాటు డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ట్రాక్టర్లు వేసుకుని వేలాదిమంది దేశ రాజధాని ఢిల్లీని ముట్టడించేందుకు ప్రయత్నిస్తుండగా,, పోలీసులు, భద్రతా బలగాలు వారిని అడ్డుకుంటున్నాయి..ఇదే సమయంలో ఓ రైతు నాయకుడిగా చెలామణి అవుతున్న నేత చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి.. కొన్ని రైతు సంస్థలు కలిసి ‘చలో ఢిల్లీ’ పేరుతో భారీ నిరసన చేపట్టాయి..ఆ రైతు సంస్థల్లో ఒకటైన భారతి కిసాన్ యూనియన్ (ఏక్తా సిద్ధూపూర్) చీఫ్ జగ్జిత్ సింగ్ దలేవాల్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతొంది..వీడియోలో సదరు నాయకుడు మాట్లాడుతూ ‘‘రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ తరువాత ప్రధాని మోదీ గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోయింది.. ఎన్నికలకు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది.. ఈ గ్యాప్‌లోనే మోదీ గ్రాఫ్‌ని మనం తగ్గించాలి’’ అని ఆ వీడియోలో జగ్జిత్ చెప్పారు..

ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్:- ఈ వీడియోపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పందిస్తూ,, ‘‘ఇది ఒక రాజకీయ ప్రకటన..భారీ నిరసనను నిర్వహించినంత మాత్రాన ప్రధాని మోదీకి ప్రజలు మద్దతివ్వడం మానేస్తారా? నిరసన తెలిపేందుకు ఇది సరైన మార్గం కాదు’’ అని అన్నారు.. తమ డిమాండ్ల కోసం రైతులు అనుసరిస్తున్న పద్ధతిని ఆయన తప్పు పట్టారు..రైతులు ఢిల్లీకి రావడం తమకెలాంటి అభ్యంతరం లేదని,, ఢిల్లీకి వచ్చేందుకు రైళ్లు, బస్సులు, వాళ్ల స్వంత వాహనాలు కూడా ఉన్నాయని అయితే ట్రాక్టర్ల ద్వారా వెళ్లడం ఆమోదయోగ్యం కాదని చెప్పారు.. ఈ రైతులకు తెర వెనుక నుంచి మద్దతు లభిస్తోందన్న అనుమానాల్ని వ్యక్తం చేశారు.

Spread the love
venkat seelam

Recent Posts

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

1 hour ago

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

20 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

21 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

1 day ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

2 days ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 days ago

This website uses cookies.