NATIONAL

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధ వాహక నౌకను జాతీకి అంకింతం ఇచ్చిన ప్రధాని మోదీ

అమరావతి: భారతదేశం, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ యుద్ధ నౌక ద్వారా అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిచిందని,,INS విక్రాంత్ దేశానికే గర్వకారణమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు..శుక్రవారం కేరళలోని కొచ్చి​ షిప్​యార్డ్​లో ఈ యుద్దనౌకను ప్రధాని మోదీ…జాతికి అంకితమిచ్చారు..ఈ సందర్బంలో ప్రధాని మాట్లాడుతూ… INS విక్రాంత్ చూసి ప్రతి భారతీయుడు గర్వించాలని చెప్పారు. INS​-విక్రాంత్ రాకతో హిందూ మహాసముద్ర జలాల్లో గస్తీ మరింత పటిష్ఠం కానున్నదని అన్నారు..ప్రపంచ పటంలో భారత్ ను ఈ నౌక సమున్నత స్థితిలో నిలుపుతుందని తెలిపారు. INS విక్రాంత్ సాతంత్ర్య సమరయోధుల కలలకు సాకారంగా నిలుస్తుందని చెప్పారు..మన దేశం తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని,,దేశానికి కొత్త భరోసా INS విక్రాంత్ ద్వారా సాధ్యమైందన్నారు..దీని నిర్మాణంలో పాల్గొన్న అందరికీ అభినందనలని అన్నారు..భారత్‌ కృషి, పరిశ్రమ, ప్రతిభకు నిలువుటద్దం ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ అని ప్రధాని అన్నారు..నౌక నిర్మాణంలో ఉపయోగించిన ఇనుము స్వదేశంలోనే తయారైంది..ఛత్రపతి శివాజీ…నౌకాదళ ఏర్పాటుతో శత్రువులకు నిద్ర లేకుండా చేశారని,,అందుకే INS-విక్రాంత్​ను ఛత్రపతి శివాజీకి అంకితమిస్తున్నాను అని అన్నారు..

INS-విక్రాంత్‌ నౌక 2023లో తూర్పు నౌకాదళ అమ్ములపొదిలో పూర్తిస్థాయిలో చేరే అవకాశముంది..ఈ నౌక గంటకు 28 నాటికల్‌ మైళ్ల(దాదాపు 51 కీ.మీ) వేగంతో ప్రయాణించనుంది..దీని తయారీకి 13 ఏళ్ల సమయం పట్టగా,,రూ.20 వేల కోట్లు ఖర్చయ్యింది..262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పు కలిగిన ఈ నౌక బరువు 37,500 టన్నులు.. ఇందులో మొత్తం 14 అంతస్తులు, 2300 కాంపార్ట్‌ మెంట్స్‌ ఉన్నాయి..విధుల్లో 1600 మంది సిబ్బంది ఉంటారు. 

Spread the love
venkat seelam

Recent Posts

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

2 hours ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

4 hours ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

8 hours ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

9 hours ago

స్పెషల్ డ్రైవ్ ద్వారా డ్రైను కాలువల పూడికతీత-MHO వెంకటరమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…

9 hours ago

కరెంట్, ఆర్టీసీ,ఇంటి పన్నులు పెంచిన జగన్ దేనికి సిద్దంగా వున్నాడు?-బాలకృష్ణ

అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…

1 day ago

This website uses cookies.