HYDERABAD

రేషన్ బియ్యంలో కేంద్రం వాటా ఎంత ? రాష్ట్రం వాటా ఎంత ? కలెక్టర్ ను నిలదీసిన నిర్మలాసీతారామన్

హైదరాబాద్: పేదలకు ఇచ్చే రేషన్ బియ్యంలో కేంద్రం వాటా ఎంత ? రాష్ట్రం వాటా ఎంత ? అంటూ కేంద్ర ఆర్దిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్,,జిల్లా కలెక్టర్ జితేష్ పటేల్ ను ప్రశ్నించారు..మంత్రి నిర్మల హఠాత్తుగా ఇటువంటి ప్రశ్నవేయటంతో కలెక్టర్ జితేష్ షాక్ అయ్యారు.సమాధానం చెప్పటంలో తెలియదు అన్నట్లుగా నీళ్లు నమిలారు..కలెక్టర్ తీరుపై మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.ఐఏఎస్ అధికారి అయి ఉండి ఈ పాటి లెక్క కూడా తెలియదా? ఇటువంటివి తెలియకుండానే జిల్లాకు కలెక్టర్ గా ఎలా పనిచేస్తున్నారు? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు..ఈ లెక్క తెలుసుకోవటానికి మీకు అరగంట సమయం ఇస్తున్నానని,, తెలుసుకుని చెప్పాలని ఆదేశించారు..దీంతో కలెక్టర్ కు దిమ్మ తిరిగిపోయింది. శుక్రవారం తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన సందర్బంలో ఈ సంఘటన చోటు చేసుకుంది..రేషన్ బియ్యంపై కిలోకు 35 రూపాయల ఖర్చవుతుంటే కేంద్రం 30 రూపాయలు భరిస్తోందని..రాష్ట్రం కేవలం ఐదు రూపాయలు మాత్రమే ఇస్తోంది అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పారు..ఇదే సమయంలో రేషన్ షాపు వద్ద ఫ్లెక్సీలో ప్రధాని మోదీ ఫొటో లేకపోవడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు..పేదలకు కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యాన్ని ఇస్తోందని… అలాంటప్పుడు ప్రధాని ఫొటోను ఎందుకు ఉంచలేదని మండిపడ్డారు..దేశ ప్రధాని పేద ప్రజల ఆకలి తీర్చడం కోసం రవాణా ఖర్చులు కూడా భరిస్తూ,,రాష్ట్రానికి బియ్యం సరఫరా చేస్తుంటే ప్రధాని మోడీ ఫోటో పెట్టలేదు..ఫోటో పెట్టవద్దని ఎవరన్నా అభ్యంతరం చెబుతున్నారా? ఫ్రీగా కేంద్రం ఇస్తుంటో ఆ మహానాయకుడి పెట్టటానికి ఏమిటి మీకు అభ్యంతరం అంటూ మంత్రి నిర్మలా సీతారామన్,,కలెక్టర్ నిలదీశారు..మా వాళ్లు (బీజేపీ నాయకులు) ప్రధాని మోడీ ఫోటో తీసుకొచ్చి పెడతారు..ఇకపై ఆ ఫోటోని ఎవ్వరు తొలగించానికివ వీల్లేదు..తొలగించకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్ దే అంటూ స్పష్టంచేశారు..

Spread the love
venkat seelam

Recent Posts

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

4 hours ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

5 hours ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

9 hours ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

11 hours ago

స్పెషల్ డ్రైవ్ ద్వారా డ్రైను కాలువల పూడికతీత-MHO వెంకటరమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…

11 hours ago

కరెంట్, ఆర్టీసీ,ఇంటి పన్నులు పెంచిన జగన్ దేనికి సిద్దంగా వున్నాడు?-బాలకృష్ణ

అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…

1 day ago

This website uses cookies.