AMARAVATHI

ఆరుగురు IPS, ముగ్గురు IASలపై బదలీ వేటు వేసిన ఎన్నికల సంఘం

అమరావతి: ఎన్నికల ప్రక్రియలో నిర్లక్ష్యంతో పాటు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అంశాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం 6- IPS,,3- IAS  అధికారులను బదిలీ చేసింది..చిలకలూరిపేటలో జరిగిన ప్రధాని సభలో భద్రతా వైఫల్యాలకు సంబంధించి బదలీ వేటు వేస్తూ ఆదేశాలిచ్చింది..ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి,, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి,, చిత్తూరు ఎస్పీ పి.జాషువా,, అనంతపురం ఎస్పీ అన్బురాజన్,, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్​పై బదిలీ వేటు వేసింది..సీనియర్ IPS అధికారి, గుంటూరు రేంజ్ IG పాలరాజును కూడా బదిలీ చేసింది..

ఓటర్ల జాబితాలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని వచ్చిన ఫిర్యాదులపై జిల్లా ఎన్నికల అధికారులుగా ఉన్న మూడు జిల్లాల కలెక్టర్లపై వేటు వేశారు.. కృష్ణా జిల్లా కలెక్టర్ పి.రాజబాబు,, అనంతపురం జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి,,తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషాలపై బదలీ వేటు పడింది..వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డికి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఈసీ సీఈవో మీనాకు ఎమర్జన్సీ నోట్​ను ఎన్నికల సంఘం పంపింది..బదలీ అయిన జిల్లాల ఎస్పీలు,,కలెక్టర్లను ఎన్నికలకు సంబంధం లేని పోస్ట్‌ ల్లో నియమించాలని జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టం చేసింది..అలాగే బదలీ అయిన అధికారులంతా తమ బాధ్యతల్ని దిగువ స్థాయి అధికారులకు మంగళవారం సాయంత్రం 5 గంటలోపు అప్పగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది..బదిలీ అయిన జిల్లాల్లో కలెక్టర్లు,, ఎస్పీల స్థానంలో నియామించేందుకు ఒక్కొక్క జిల్లాలో ముగ్గురు అధికారుల పేర్లను కమిషన్​కు పంపాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…

43 mins ago

ఈసీ సస్పెండ్ చేసిన పోలీసు అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగ్ లు

అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…

1 hour ago

బెంగళూరు జరిగిన రేవ్‌ పార్టీలో 100 మంది అరెస్ట్- టీవీ నటీనటులు,మోడల్స్

దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని…

2 hours ago

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి

ఓల్డ్ మోడల్ హెలికాప్ట‌ర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…

3 hours ago

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

21 hours ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

1 day ago

This website uses cookies.