SPORTS

ఆసియా క్రీడల్లో భారతదేశ ఆడబిడ్డల ప్రతిభను చాటింది-ప్రధాని మోదీ

అమరావతి: అత్యునత వేదికలపైన విజయం కోసం కొంత మంది అథ్లెట్లు తాత్కలిక స్టెరాయిడ్స్ వాడుతారని,, తరువాత జరిగే డోప్ టెస్ట్ ల్లో నిషేధిత స్టెరాయిడ్స్ ఛాయలు బయటపడిన అనంతరం అథ్లెట్లు కెరీయర్ తో పాటు దేశం పరువు కూడా పోతుందని,,అలాంటి  స్టెరాయిడ్స్ కు దూరంగా వుండాలని భవిష్యత్ అథ్లెట్లుకు చెప్పాలను ఆసియన్ గేమ్స్ విజేతలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరారు..మంగళవారం ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో దేశానికి రికార్డు స్థాయిలో పతకాల పంట పడించిన ఆసియన్ గేమ్స్ కంటింజెంట్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  అభినందించారు.. చరిత్రను సృష్టించారంటూ ప్రశంసలు కురిపించారు. మహిళా అథ్లెట్లు అద్భుతమైన ప్రతిభ కనబరిచారని శ్లాఘించారు.. ‘ఆసియా క్రీడల్లో మన నారీ శక్తి చూపించిన ప్రతిభను చూసి ఎంతో గర్విస్తున్నాను.. మీరు సాధించిన విజయాలు ఈ దేశంలోని ఆడబిడ్డల ప్రతిభను చాటుతోంది.. ఇండియన్ టీమ్ చూపించిన ప్రతిభాపాటవాలతో దేశంలో పండుగ వాతావరణం నెలకొంది” అని ప్రధాని మోదీ అన్నారు.. క్రీడాకారుల బృందం చరిత్ర సృష్టించిందని, అథ్లెట్లందరికీ 140 కోట్ల భారతీయుల తరఫున స్వాగతం పలుకుతున్నానని చెప్పారు.. క్రీడాకారుల కఠోర శ్రమ, సాధించిన విజయాలతో దేశంలో పండుగ వాతావరణం ఏర్పడిందన్నారు..మన దేశంలో ప్రతిభకు కొరత లేదని, కానీ కొన్ని ప్రతికూలతల కారణంగా క్రీడాకారుల ప్రతిభను పతకాలుగా మార్చుకోలేకపోయామన్నారు..ఆసియా క్రీడల్లో భారత టీమ్ 100కు పైగా మెడల్స్ సాధించుకుందని,, ఇందులో 28 స్వర్ణ, 38 రజిత, 41 కాంస్య పతకాలు సాధించడం చరిత్రగా నిలించిందన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

బెంగళూరు జరిగిన రేవ్‌ పార్టీలో 100 మంది అరెస్ట్- టీవీ నటీనటులు,మోడల్స్

దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని…

16 mins ago

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి

ఓల్డ్ మోడల్ హెలికాప్ట‌ర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…

51 mins ago

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

19 hours ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

24 hours ago

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

2 days ago

తిరుపతి,అనంతపురం, పల్నాడు జిల్లాలకు కొత్త కలెక్టర్,ఎస్పీలు

FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…

2 days ago

This website uses cookies.