DISTRICTS

నేడు డిగ్రీలు పొందిన విద్యార్థులు దేశ సేవలో బాగస్వాములు కావాలి- రాష్ట్ర గవర్నర్

తిరుపతి: భారతదేశ ఉన్నత విద్యా వ్యవస్థ ప్రపంచంలో రెండవ అతి పెద్దదిగా ఉందని, అత్యాధునిక పరిజ్ఞానం, అత్యంత నైపుణ్యం కలిగిన మానవ శక్తిని అందించడం మన లక్ష్యం కావాలని శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయ కులపతి, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. శుక్రవారం శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయ 19,, 20వ స్నాతకోత్సవం మహిళా విశ్వవిద్యాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణoగా ఉన్నత విద్యాసంస్థలు మెరుగైన విద్యా విజ్ఞానాన్ని అందించడానికి  కృషి చేయాలని అన్నారు. పాఠ్య, పరిశోదనలు నిరంతరం జరగాలని అప్పుడే సమర్థవంతమైన ఉన్నత విద్య రాణించగలుగుతుందని అన్నారు. ఉమ్మడి బోధన, వర్చువల్ లెర్నింగ్, ఉపన్యాసాలు ద్వారా ప్రపంచవ్యాప్తంగా విద్యా సంస్థల మధ్య విజ్ఞానాన్ని పంచుకోవాలని అద్యాపకులు కొత్త పద్దతులలో భోదనలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ విశ్వవిద్యాలయం భారతీయ ఉన్నత విద్యా సంస్థలలో 24వ స్థానంలో నిలిచినందుకు 2021-22 ఫార్మసీ విభాగంలో 42వ ర్యాంకును సాదించినందుకు సంతోషంగా ఉందన్నారు.

వైస్ చాన్సలర్ డి.జమున మాట్లాడుతూ శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం దేశంలోనే ఆదర్శంగా నిలిచి విద్యా భోదన, పరిశోదనలు నిర్వహిస్తున్నామని ఎంతో మంది ప్రముఖులు ఈ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారని అన్నారు. వివిధ యూనివర్సిటీలు, విద్యా సంస్థలతో బాగస్వాములై విద్య, విజ్ఞానంలో పురోగతిలో ఉన్నామని 27 డిపార్ట్మెంట్ లు, 34 యు.జి., పి.జి. కోర్సులు నిర్వహిస్తున్నామని వివరించారు. Phd-71 మంది, M.Phil-3, 1902 మంది వివిధ కోర్సులలో పట్టాలు అందుకున్నరన్నారు. వీరిలో అత్యున్నత ప్రతిభ కనబరిచి మెడల్స్, బుక్ ప్రైజ్ లు, క్యాష్ ప్రైజ్ లు అందుకున్న 108 మందికి గవర్నర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

Spread the love
venkat seelam

Recent Posts

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

57 mins ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

16 hours ago

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

21 hours ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

1 day ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

2 days ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

2 days ago

This website uses cookies.