NATIONAL

ఇలాంటి పిటిషన్ మీరు వేసినందుకు మేం ఎందుకు జరిమానా విధించకూడదు-సుప్రీం

అమరావతి: నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాన మంత్రి బదులుగా రాష్ట్రపతి ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటీషన్‌ను సుప్రింకోర్టు తిరస్కరించింది.. గురువారం న్యాయవాది సిఆర్ జయ‌సుకిన్ దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై శుక్రవారం వేకేషన్ బెంచ్ న్యాయమూర్తులు జెకె మహేశ్వరి,, పీఎస్ నరసింహలు విచారించారణ జరిపేందుకు విముఖత వ్యక్తం చేశారు..ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ,, మీరు ఇలాంటి పిటిషన్‌లతో ఎందుకు వస్తున్నారో మాకు అర్థం కావడం లేదు..ఆర్టికల్ 32 ప్రకారం దానిని స్వీకరించడానికి మాకు ఆసక్తి లేదని జస్టిస్ నరసింహ అన్నారు..ఇలాంటి పిటిషన్ మీరు వేసినందుకు మేం ఎందుకు జరిమానా విధించకూడదు అని పిటిషనర్‌ను సుప్రింకోర్టు ప్రశ్నించింది..ఈ విషయమై న్యాయమూర్తులు మాట్లాడుతూ,, మేం ఈ విషయంలో జోక్యం చేసుకోదలుచుకోవడం లేదు..ఇది కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అంశం కాదు.. ఎగ్జిక్యుటివ్ హెడ్ (ప్రధాని) పార్లమెంట్ సభ్యుడు అని సుప్రీంకోర్టు పేర్కొంది.. రాజ్యాంగ అధిపతి (అధ్యక్షుడు) పార్లమెంట్‌లో భాగం..పిటిషన్‌ను కొట్టివేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది..అనంతరం పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు న్యాయవాది అనుమతి కోరాగా అందుకు న్యాయమూర్తి పిటిషన్ ను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇచ్చారు.

Spread the love
venkat seelam

Recent Posts

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

14 hours ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

14 hours ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

1 day ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

2 days ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

2 days ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

2 days ago

This website uses cookies.