NATIONAL

ఆదిపురుష్ లో రామాయణం ఎక్కడుంది? గ్రాఫిక్స్ తప్ప?

బాయ్‌కాట్ ఆదిపురుష్,బ్యాన్ ఆదిపురుష్..

హైదరాబాద్: ప్యాన్ ఇండియా మూవీగా సిద్దమౌవుతున్న ప్రభాస్ నటించిన ఆదిపురుష్ టీజర్ చిత్రం యూనిట్ విడుదల చేసింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్నఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడుగా నటించారు. టీజర్ రిలీజైనప్పటి నుంచి టీజర్ పై, సినిమా చిత్రకరణపై, డైరెక్టర్ పై విమర్శలు,సోషల్ మీడియాలో ట్రోల్స్ విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ప్రభాస్ అభిమానులు, రామాయణం అని చెప్పి బొమ్మల సినిమా, గ్రాఫిక్స్ సినిమా తీశారేంటి అని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఇదే సమయంలో అసలు అందులో రామాయణం ఎక్కడుంది? రావణాసురుడు ఎలా ఉంటాడో తెలీదా, హనుమంతుడు ఎలా ఉంటాడో తెలీదా అంటూ హిందూ సంఘాలు, హిందువులు, బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. రామాయణం అని చెప్పి ఏదో హాలీవుడ్ గ్రాఫిక్స్ సినిమా చూపిస్తున్నారని, అందులో రామాయణం ఆనవాళ్లు ఒక్కటి కూడా లేవని దర్శకుడు ఓం రౌత్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

టీజర్ చూసిన వారందరూ ఏకంగా బాయ్‌కాట్ ఆదిపురుష్, బ్యాన్ ఆదిపురుష్ అని ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ హీరో,హీరోయిన్స్,డైరక్టర్స్ పై తీవ్ర వ్యతిరేకత ఉంది. బాయ్‌కాట్ బాలీవుడ్ అంటూ గత కొన్ని రోజులుగా  బాలీవుడ్ పై వ్యతిరేకత వస్తున్నవిషయం విదితమే. దీనికి ముఖ్య కారణం బాలీవుడ్ సినిమాల్లో హిందూ దేవుళ్ళని, పురాణాల్ని, హిందూ చరిత్రని వక్రీకరించడమే.బాలీవుడ్ హీరోలు, డైరెక్టర్స్ హిందూ పురాణాల్ని నాశనం చేస్తున్నారంటూ నార్త్ తో పాటు సౌత్ కూడా విమర్శిస్తోంది. ఆదిపురుష్ టీజర్ చూస్తుంటేనే అర్థమైపోతుంది అసలు రామాయణం పాత్రలకి ఇక్కడ కనపడేవాటికి సంబంధం లేదని. అందుకే ఇప్పుడు బాయ్‌కాట్ ఆదిపురుష్ , బ్యాన్ ఆదిపురుష్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉంది.మరి రాబోయే రోజుల్లో ఏం జరుగనున్నదొ వేచి చూడాల్సిందే?

Spread the love
venkat seelam

Recent Posts

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

13 hours ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

15 hours ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

18 hours ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

20 hours ago

స్పెషల్ డ్రైవ్ ద్వారా డ్రైను కాలువల పూడికతీత-MHO వెంకటరమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…

20 hours ago

కరెంట్, ఆర్టీసీ,ఇంటి పన్నులు పెంచిన జగన్ దేనికి సిద్దంగా వున్నాడు?-బాలకృష్ణ

అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…

2 days ago

This website uses cookies.