NATIONAL

14 రంగాలకు ప్రోత్సాహం-క్రీయాశీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం కేబినెట్

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది..కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు..సౌరశక్తి ప్లాంట్ల కోసం కేంద్రం 19,500 కోట్లు మంజూరు చేసింది..అలాగే 14 రంగాలకు ప్రోత్సాహం కల్పించేందుకు PLI స్కీమ్ తీసుకొచ్చింది..అలాగే PLI స్కీమ్ క్రింద సోలార్ ప్యానెళ్లను చేర్చారు.. సెమీ కండక్టర్ల అభివృద్ధి కార్యక్రమానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది..ఈ నెల 17వ తేదిన ప్రధానమంత్రి మోదీ ప్రారంభించిన నేషనల్ లాజిస్టిక్స్ పాలసీని కేంద్రం ఆమోదించింది.. 2030 నాటికి టాప్ 25 దేశాల సరసన చేరేలా లాజిస్టిక్ ఇండెక్స్ ర్యాంకింగ్ మెరుగుపరుచుకునే చర్యలు చేపట్టనున్నారు..వస్తువులు దేశవ్యాప్తంగా అంతరాయాలు లేకుండా రవాణా అయ్యే విధంగా చేయడం కోసం ఈ విధానం ఉపయోగపడుతుంది. ప్రాసెస్ రీ ఇంజినీరింగ్, డిజిటైజేషన్, మల్టీ మోడల్ ట్రాన్స్‌ పోర్ట్‌ లపై ప్రధానంగా  ఈ పాలసీ దృష్టి సారిస్తుంది..దేశం నలుమూలలకు ఎటువంటి అంతరాయాలు లేకుండా వస్తువులు, ఉత్పత్తుల రవాణా జరగాలనే లక్ష్యంతో ఈ విధానాన్ని రూపొందించారు.

Spread the love
venkat seelam

Recent Posts

వాటర్ ప్యాకెట్లపై తయారీ, ఎక్స్ పెయిరీ తేదీలు లేకపోతే క్రిమినల్ కేసులే-MHO వెంకట రమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…

2 hours ago

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

23 hours ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

23 hours ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

2 days ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

2 days ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

2 days ago

This website uses cookies.