DISTRICTS

మైనారిటీ గురుకుల పాఠశాల భవన నిర్మాణం-బహుళార్ధ సౌకర్యాల కేంద్రాలపై-కలెక్టర్ సమీక్ష

నెల్లూరు: మైనారిటీ గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులు వేగవంతం చేసి వచ్చే విద్యా సంవత్సరానికి ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.మంగళవారం క్యాంపు కార్యాలయంలో నెల్లూరు రూరల్ అక్కచెరువుపాడులో 15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న మైనార్టీ గురుకుల బాలుర పాఠశాల భవన నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులు వేగవంతం చేసి వచ్చే ఏడాది జూన్ మాసంలో ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని సూచించారు. ఈ పాఠశాలకు అవసరమైన ఫర్నిచర్, తాగునీరు, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలన్నీ నాడు నేడు పథకం కింద సమకూర్చాలని ఆదేశించారు.

బహుళార్ధ సౌకర్యాల కేంద్రాలు:- వచ్చే అక్టోబర్ 15వ తేదీన  సీ.ఎం ప్రారంభించే విధంగా బహుళార్ధ సౌకర్యాల కేంద్రాల నిర్మాణం పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.మంగళవారం క్యాంపు కార్యాలయంలో బహుళార్థ సౌకర్యాల కేంద్రాల నిర్మాణంపై సంబంధిత అధికారులతో నాలుగవ జిల్లా స్థాయి అమలు కమిటీ సమావేశం నిర్వహించి గోదాముల నిర్మాణ పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మంజూరైన 48 గోదాములకు గాను 10 గోదాములు పూర్తికాగా మరో 10 గోదాములు పూర్తయ్యే దశలో ఉన్నాయన్నారు. మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయన్నారు. రెండు చోట్ల స్థలాలను వెంటనే గుర్తించి గోదాముల నిర్మాణం పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. వచ్చే అక్టోబర్ 15 తేదీలోగా కనీసం 30 గోదాముల నిర్మాణం పూర్తి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రిచే ప్రారంభించేందుకు సిద్ధం చేయాలన్నారు. ఈ సందర్భంగా 24 గోదాముల నిర్మాణానికి ఇప్పటివరకు ఖర్చు అయిన మొత్తాలకు సంబంధించి నిధులను విడుదల చేసేందుకు కమిటీ ఆమోదించింది.ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్  ఆర్.కూర్మానాధ్ అధికారులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

వైసీపీ ఎం.పీలు,ఎమ్మేల్యేలు జగన్ కాలి క్రింద చెప్పులే-అంబటి

అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…

6 hours ago

122 సంవత్సరాల తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు

అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్‌లో వడగాలులు…

14 hours ago

దక్షిణ చైనాలో కుప్పకూలిన వంతెనలో కొంత భాగం-19 మంది మృతి

అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…

1 day ago

నెల్లూరు పార్లమెంటుకు 14 మంది-అసెంబ్లీలకు 115 మంది అభ్యర్థులు-కలెక్టర్‌

మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…

2 days ago

ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన ఎన్డీఏ కూటమి

అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…

2 days ago

మే 2 నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం- జనరల్ అబ్జర్వర్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…

3 days ago

This website uses cookies.