Categories: Uncategorized

భవనాల కూల్చివేతల సందర్భంగా మిగిలే డెబ్రిస్ వ్యర్ధాల తొలగింపు?-కమిషనర్ హరిత

నెల్లూరు: పర్యావరణ హితం కోసం జాతీయ హరిత ట్రిబ్యునల్ ( NGT) సూచించిన మార్గదర్శకాలను నగర వ్యాప్తంగా అమలుచేసి ప్రతిఒక్కరూ పటిష్టంగా పాటించేలా అవగాహన కల్పించాలని నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత సూచించారు. భవనాల కూల్చివేతల సందర్భంగా మిగిలే డెబ్రిస్ వ్యర్ధాల తొలగింపుకు నగర పాలక సంస్థ సహకారం తీసుకునేలా నగర వ్యాప్తంగా ప్రచారం కల్పించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను కమిషనర్ కోరారు. నగర పాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులతో ఎన్.జి.టి మార్గదర్శకాలపై సమీక్ష సమావేశాన్ని కార్యాలయంలోని సమావేశం మందిరంలో శనివారం నిర్వహించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పాలక సంస్థ సూచించిన టోల్ ఫ్రీ నెంబర్ కు భవనాల యజమానులు సమాచారం అందిస్తే కార్పొరేషన్ వాహనాల ద్వారా నిర్దేశించిన స్థలాల్లో మాత్రమే డంపింగ్ జరపాలని, ఇతర ప్రాంతాల్లో డంపింగ్ చేస్తే జరిమానాలు విధించాలని కమిషనర్ ఆదేశించారు. చెత్త సేకరణ వాహనాల రాకను సూచించే పాటకు తోడుగా కార్పొరేషన్ సమాచారం అందించే మాటలను కూడా జతపర్చాలని కమిషనర్ సూచించారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ సూచించిన మార్గదర్శకాలను అమలుచేసి నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా సహకరించాలని కమిషనర్ ఆకాంక్షించారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

51 mins ago

డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదలీ వేటు

అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…

1 hour ago

ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ కు 8వ తేదీ వరకు ఓటింగ్‌కు అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్‌ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ…

2 hours ago

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

22 hours ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

23 hours ago

అభ్యర్థులకు ఓటర్ల జాబితా పంపిణీ చేసిన వికాస్ మర్మత్

నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర  అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…

1 day ago

This website uses cookies.