భవనాల కూల్చివేతల సందర్భంగా మిగిలే డెబ్రిస్ వ్యర్ధాల తొలగింపు?-కమిషనర్ హరిత

నెల్లూరు: పర్యావరణ హితం కోసం జాతీయ హరిత ట్రిబ్యునల్ ( NGT) సూచించిన మార్గదర్శకాలను నగర వ్యాప్తంగా అమలుచేసి ప్రతిఒక్కరూ పటిష్టంగా పాటించేలా అవగాహన కల్పించాలని నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత సూచించారు. భవనాల కూల్చివేతల సందర్భంగా మిగిలే డెబ్రిస్ వ్యర్ధాల తొలగింపుకు నగర పాలక సంస్థ సహకారం తీసుకునేలా నగర వ్యాప్తంగా ప్రచారం కల్పించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను కమిషనర్ కోరారు. నగర పాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులతో ఎన్.జి.టి మార్గదర్శకాలపై సమీక్ష సమావేశాన్ని కార్యాలయంలోని సమావేశం మందిరంలో శనివారం నిర్వహించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పాలక సంస్థ సూచించిన టోల్ ఫ్రీ నెంబర్ కు భవనాల యజమానులు సమాచారం అందిస్తే కార్పొరేషన్ వాహనాల ద్వారా నిర్దేశించిన స్థలాల్లో మాత్రమే డంపింగ్ జరపాలని, ఇతర ప్రాంతాల్లో డంపింగ్ చేస్తే జరిమానాలు విధించాలని కమిషనర్ ఆదేశించారు. చెత్త సేకరణ వాహనాల రాకను సూచించే పాటకు తోడుగా కార్పొరేషన్ సమాచారం అందించే మాటలను కూడా జతపర్చాలని కమిషనర్ సూచించారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ సూచించిన మార్గదర్శకాలను అమలుచేసి నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా సహకరించాలని కమిషనర్ ఆకాంక్షించారు.