NATIONAL

ఉచిత పథకలపై వివరణ ఇవ్వండి-రాజకీయ పార్టీలకు ఎన్నిక సంఘం లేఖ

అమరావతి: రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం (ECE) ఎన్నికల మేనిఫెస్టోలలో పెట్టిన అంశాలను ఎలా నెరవేరుస్తారో చెప్పాలని మంగళవారం లేఖ రాసింది. దీనిపై తమకు కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను కోరింది. అలాగే పార్టీలకు ఉన్న ఆర్థిక వనరులేంటి ? అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ? అనేది కూడా పేర్కొన్నాలని నిర్దేశించింది. ఈ అంశాలపై  ఈనెల 19 లోగా సమాధానం ఇవ్వలని రాజకీయ పార్టీలకు కోరింది.ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదికలో రాష్ట్ర ప్రభుత్వాల ఉచిత హామీలను ‘టైమ్‌ బాంబులు’గా అభివర్ణించింది. ‘ఉచిత’ పథకాల ఖర్చు పరిమితిని సుప్రీంకోర్టు ప్యానెల్‌ ద్వారా నియంత్రించాల్సిందిగా సూచించింది. రాష్ట్రప్రభుత్వాలు ప్రకటించే సంక్షేమ పథకాల ఖర్చు ఆయా రాష్ట్రాల స్థూల ఉత్పత్తిలో 1 శాతం లేదా పన్ను ఆదాయంలో 1 శాతాన్ని మించకుండా చూడాలని అభిప్రాయపడింది. ఎస్‌బీఐ ప్రధాన ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్‌,,వివిధ రాష్ట్రాలు అందిస్తున్న ఉచితాలపై ఈ నివేదికను రూపొందించారు. కొన్ని రాష్ట్రాల్లో పార్టీలు పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరణను కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని నివేదికలో ప్రస్తావించారు. కార్పొరేషన్‌ అప్పుల్లో,, పలు రాష్ట్రాల ఆప్‌-బడ్జెట్‌ బారోయింగ్స్‌ అంటే కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా సేకరించే బడ్జెటేతర అప్పుల భారం కూడా భారీగా పెరుగుతోందని తెలిపారు.2022 GDPలో ఆ అప్పుల మొత్తం 4.5 శాతంగా ఉందని ఘోష్‌ నివేదికలో ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అప్పుల విషయంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, ఆ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో బడ్జెటేతర అప్పుల భారం 11.7 శాతంగా ఉందన్నారు. తెలంగాణ తరువాత స్థానాల్లో సిక్కిం (10.8 శాతం), ఆంధ్రప్రదేశ్‌ (9.8 శాతం), రాజస్థాన్‌ (7.1 శాతం), ఉత్తరప్రదేశ్‌ (6.3 శాతం) ఉన్నాయని వెల్లడించారు. 

Spread the love
venkat seelam

Recent Posts

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

19 hours ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

21 hours ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

1 day ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

1 day ago

స్పెషల్ డ్రైవ్ ద్వారా డ్రైను కాలువల పూడికతీత-MHO వెంకటరమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…

1 day ago

కరెంట్, ఆర్టీసీ,ఇంటి పన్నులు పెంచిన జగన్ దేనికి సిద్దంగా వున్నాడు?-బాలకృష్ణ

అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…

2 days ago

This website uses cookies.