AMARAVATHI

జనసేనకు జగ్గుభాయ్ కీ మధ్య పోరాటమిది-పవన్ కళ్యాణ్

జనసేనకు జగ్గుభాయ్ కీ మధ్య పోరాటమిది… వాలంటీర్లే వైసీపీకి ప్రైవేటు సైన్యం… రాష్ట్ర తమదే అనే భ్రమలో జగ్గుభాయ్ గ్యాంగ్ ఉన్నారు… త్వరలోనే ఆ భ్రమలు తొలగిస్తాం…సాక్షి పేపర్ కోసం ఏటా రూ. 48 కోట్లు ప్రజాధనం లూటీ… అర్హతలేని వాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలుతున్నాడు..
అమరావతి: జగన్, మాటకు వస్తే పెళ్లాం పెళ్లాం అంటు సీ.ఎం స్థాయిలో వుంటే అతను మాట్లాడే భాష చూస్తుంటే చిరాకేస్తుందని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు..గురువారం తాడేపల్లిగూడెం జనసేనికులు, వీరమహిళలు, నాయకుల సమావేశంలో ప్రసంగిస్తూ పవన్ కళ్యాణ్ కొంత ఉద్వేగానికి గురయ్యారు..‘‘నా పెళ్లాన్ని అంటే పట్టించుకోను.. నా వివాహాలకు సంబంధించి విడాకులు తీసుకున్నా.. జగన్ మాత్రం నా పెళ్లిళ్లు పట్టుకుని అక్కడే ఉన్నాడంటూ’’ వ్యాఖ్యనించారు.. ప్రసంగంలో జగ్గూభాయ్ అంటూ సీయం జగన్ పై జనసేనాని సెటైర్లు వేశారు.. ప్రసంగం ఆద్యాంతం సీయం జగన్ ను జగ్గూభాయ్ అంటూనూ సంబోధించారు. ‘‘నన్ను అన్నా.. నా కుటుంబాన్ని అన్నా నాకు కోపం రాదు.. ప్రజలను అంటే మాత్రం నాకు కోపం వస్తుంది..శ్రీకళాహస్తీలో జనసేన కార్యకర్తపై ఒక మహిళా సీఐ చేయి చేసుకోవడం చాలా బాధేసిందని,శ్రీకళాహస్తీకే వచ్చి తేల్చుకుంటా అని చెప్పారు..జగన్ సోదరి పార్టీ పెట్టారు.. ఇప్పుడు కాంగ్రెస్ లో కలిపేస్తున్నారని అంటున్నారు..మీరు అలా చేస్తారా అని నన్ను అడిగారు.. పార్టీని నడపడం చాలా కష్టం.. వేల కోట్లు ఉంటే చాలదు.. సైద్ధాంతిక బలం, పోరాటపటిమ, రాజ్యాంగంపై అవగాహన ఉంటేనే పార్టీని నడపగలం..వెంటనే అధికారంలోకి రావాలని నేను అనుకోవడం లేదు.. అలా అనుకుని వుండివుంటే కాంగ్రెస్ లోకి వెళ్లి ఏదో పదవి తెచ్చుకునే వాడిని అని అన్నారు.. జగ్గుభాయ్ ను ఇంటికి పంపే రోజు వచ్చింది.. విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుందో చూపిస్తాన్నారు.. కొందరు వాలంటీర్లు నా దిష్టిబొమ్మలను చెప్పులతో కొట్టి, దగ్ధం చేస్తుంటే.. అటువంటి వాటిని అసలు పట్టించుకోను.. వైఎస్సార్ ను అందరూ దేవుడంటారు.. ఆయన దేవుడు అయితే అంతమంది ఐఏఎస్ లు జైలుకు ఎందుకెళ్ళారు ? ఆయన అవినీతి చెయ్యబట్టే కదా.. ప్రభుత్వం మారితే కొందరు వాలంటీర్లు ఆ విధంగానే ఇరుక్కుంటారు’’ అంటూ సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో థ్వజమెత్తారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది-ద్వారకా తిరుమలరావు

సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…

11 hours ago

పీఠాపురం చేరుకున్న సురేఖ,రామ్‌ చరణ్-పవన్ కల్యాణ్ ని గెలిపించండి

అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…

14 hours ago

ఓటరు అసిస్టెంట్‌ బూత్‌ల ఏర్పాటు-మే 13న పోలింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు-కలెక్టర్‌

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్‌…

15 hours ago

12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగానికి అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…

1 day ago

క్రేజీ వాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు

అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్‌పై…

1 day ago

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

2 days ago

This website uses cookies.