DISTRICTS

కూరగాయల మార్కెట్టులో పరిశుభ్రతను పర్యవేక్షించండి-కమిషనర్ వికాస్

నెల్లూరు: ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్టులో ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నియంత్రించి, పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక మద్రాస్ బస్టాండ్ ఏ.సీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్టు, రమేష్ రెడ్డి నగర్ లోని గోశాల, కలెక్టరేట్ పరిసరాలు, అర్చన సినిమా హాలు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న చెత్త సేకరణ పనులను అసిస్టెంట్ కలెక్టర్ విద్యాధరితో కలిసి కమిషనర్ బుధవారం ఉదయం పర్యవేక్షించారు.

స్థానిక మద్రాస్ బస్టాండ్ ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్టు లోపల పార్కింగ్ సౌకర్యం గురించి కమిషనర్ పరిశీలించారు. మార్కెట్టు బయట రోడ్డు వెంబడి విక్రయదారులు ఉదయం 7.30 గంటలకు పరిసరాలను శుభ్రం చేసి, ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా ఖాళీ చేయాలని కమిషనర్ ఆదేశించారు. నగర వ్యాప్తంగా అన్ని ప్రధాన మార్గాలను ఉదయం 7 గంటలలోపు శుభ్రం చేసేలా పర్యవేక్షించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.

కూరగాయల మార్కెట్టు షాపుల నిర్వాహకులతో కమిషనర్ ప్రత్యక్షంగా మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్లలను పూర్తిగా నిషేదించామని, నిషేధిత ప్లాస్టిక్ కవర్ల వినియోగం, వాడకంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. షాపు ప్రాంగణాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, షాపుల పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే షాపు నిర్వహకునికి జరిమానా విధిస్తామని కమిషనర్ హెచ్చరించారు. 

స్థానిక రమేష్ రెడ్డి నగర్ గోశాలను సందర్శించిన కమిషనర్ ప్రాంగణానికి గేటు ఏర్పాటు చేసి సి.సి కెమెరాల సౌకర్యం కల్పించాలని సూచించారు. గోశాల ప్రాంగణంలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరిగేలా క్రమంతప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు..ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ, మార్కెటింగ్ విభాగం ఏ.డి, మార్కెట్టు కాంట్రాక్టరు, శానిటేషన్ సూపర్వైజర్లు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ లు, సచివాలయం శానిటేషన్ కార్యదర్శులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

వైసీపీ ఎం.పీలు,ఎమ్మేల్యేలు జగన్ కాలి క్రింద చెప్పులే-అంబటి

అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…

15 hours ago

122 సంవత్సరాల తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు

అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్‌లో వడగాలులు…

22 hours ago

దక్షిణ చైనాలో కుప్పకూలిన వంతెనలో కొంత భాగం-19 మంది మృతి

అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…

2 days ago

నెల్లూరు పార్లమెంటుకు 14 మంది-అసెంబ్లీలకు 115 మంది అభ్యర్థులు-కలెక్టర్‌

మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…

3 days ago

ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన ఎన్డీఏ కూటమి

అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…

3 days ago

మే 2 నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం- జనరల్ అబ్జర్వర్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…

3 days ago

This website uses cookies.