AMARAVATHI

రేపు “నా భూమి – నా దేశం” కార్యక్రమం- కమిషనర్ వికాస్ మర్మత్

నెల్లూరు: భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖ,యువజన వ్యవహారాల మంత్రిత్వశాఖల ఆదేశాల మేరకు ఈ నెల 29వ తేదీన నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో “నా భూమి-నా దేశం” కార్యక్రమంలో భాగంగా “అమృత కలశ యాత్ర”ను ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని కమిషనర్ వికాస్ మర్మత్ గురువారం తెలిపారు. కలెక్టర్ హరినారాయణన్ సూచనలతో నగర పాలక సంస్థ పరిధిలో శుక్రవారం వార్డుల స్థాయిలో డోలు, నగారా వంటి సంప్రదాయ సంగీత వాయిద్యాలతో ఇంటింటికి తిరిగి మట్టిని, అమృత కలశములో వరి బియ్యాన్ని సేకరించనున్నామని వెల్లడించారు. సచివాలయ వార్డు అడ్మిన్ కార్యదర్శుల నేతృత్వంలో ప్రజలతో పంచ ప్రాణ ప్రతిజ్ఞ చేయించనున్నామని కమిషనర్ తెలిపారు.

సేకరించిన అమృత కలశాలను, మట్టిని అక్టోబర్ నెల 13వ తేదీ లోగా నగర పాలక సంస్థలో సమీకరించుకుని, పండుగ వాతావరణం సృష్టించేలా కార్యాచరణ రూపొందించామని వివరించారు. కార్యక్రమంలో భాగంగా అమరవీరులను సత్కరించటం, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, NSS,,NCC, అంగన్వాడీ కార్యకర్తలను భాగస్వామ్యం చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.

Spread the love
venkat seelam

Recent Posts

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

5 hours ago

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

10 hours ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

1 day ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

1 day ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

1 day ago

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

2 days ago

This website uses cookies.