AMARAVATHI

కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంపై నిపుణుల బృందం ప్రాథమిక నివేదిక

అమరావతి: కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంపై నిపుణుల బృందం రైల్వేశాఖకు ప్రాథమిక నివేదిక అందచేసింది..సిగ్నలింగ్ వ్యవస్థ వైఫల్యమే ఒడిస్సాలో ఘోర రైలు ప్రమాదం కారణమని సౌత్ ఈస్ట్ సర్కిల్ కమిషనర్ ఏ ఎం చౌదరి నేతృత్వంలోని నిపుణుల బృందం రైల్వే శాఖకు ఇచ్చిన ప్రాథమిక నివేదికలో వెల్లడించింది..సిగ్నల్ లోపం కారణంగానే రైలు ప్రమాదం జరిగిందని,,లూప్ లైన్ లో ఆగివున్న గూడ్స్ రైలును కోరమండల్ రైలు ఢీ కొట్టింది అని రైల్వేశాఖకు తెలియజేసింది..మెయిన్ లైన్ పై వెళ్లేందుకు కోరమండల్ కు సిగ్నల్ ఇచ్చారని అయితే ఆ రైలు మాత్రం పొరపాటున లూప్ లైన్ లోకి వెళ్లిందని నివేదికలో వెల్లడించింది.. రైళ్లలో భద్రతా వాటి సామర్థ్యం పెంపునకు ఉద్దేశించిన స్వదేశీ ప్రపంచస్థాయి సాంకేతికత కవచ్ (kavach) ప్రమాదం జరిగిన మార్గంలో అందుబాటులో లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని అనుమానిస్తున్నారు..ఈ వ్యవస్థ అందుబాటులో వుండి ఉంటే ప్రమాదం ని లేదా నష్టం తప్పి వుండేదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..

ప్రాథమిక నివేదిక:-మెయిన్ లైన్ పైనే కోరమాండల్ కు సిగ్నల్ ఉంది…లూప్ లైన్ లో ఆగివున్న గూడ్స్ ను కోరమాండల్ ఢీకొన్నది…రైలు ప్రమాదానికి సిగ్నల్ ఫెయిల్యూరే కారణం…కోరమాండల్ ఎక్స్ ప్రెస్ కు 6:55 గంటల సమయంలో ప్రమాదం జరిగింది…రైల్లోని 21 బోగీలు పట్టాలు తప్పాయి…మొదట సిగ్నల్ ఇచ్చినా.. ఆ తరువాత దాన్ని ఆపేశారు…దిని కారణంగా కోరమాండల్ రాంగ్ ట్రాక్ పైకి వెళ్లాల్సి వచ్చింది…మెయిన్ లైన్ బదులు లూప్ లైన్ లోకి కోరమాండల్ ఎక్స్ ప్రెస్ వెళ్లింది…గార్డ్ బ్రేక్ వ్యాన్,,హాల్ కోచ్ లు మెయిన్ లైన్ పై ఉన్నాయని నిపుణుల బృందం ప్రాథమిక నివేదికలో తేల్చింది.

కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుల సంఖ్య 1257 మంది కాగా,,యశ్వంత్ పూర్ ఎక్స్ ్రెస్ లో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుల సంఖ్య 1039 మంది..ఒడిశారైలు ప్రమాదంలో వెయ్యి మందికి పైగా ప్రయాణికులకు గాయాలు కాగా మృతుల సంఖ్య 300కు పెరిగే అవకాశం వుంది..భువనేశ్వర్,,కటక్ ఆస్పత్రుల్లో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు..చనిపోయిన వారిలో ఎక్కువ మంది తమిళ ప్రయాణికులు వున్నారు.. రెండు రైళ్లలో తెలుగువాళ్లు 200 మంది ఉండొచ్చని అంచనా వేస్తున్నారు..
విపత్తుల సంస్థ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ 24/7 ఏర్పాటు…కంట్రోల్ రూమ్ నెంబర్స్ 1070, 112, 1800 4250101, గల్లంతైనవారి ఆచూకీ కోసం 8333 9050 22 నెంబర్ …ప్రయాణికుని ఫోటో, ఇతర వివరాలు వాట్సాప్ చేస్తే,,పోలీస్ శాఖతో సమన్వయ పరుచుకుని వివరాలు తెలియజేస్తామని ఏపీ విపత్తుల నివారణ సంస్థ తెలిపింది.

Spread the love
venkat seelam

Recent Posts

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

7 hours ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

9 hours ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

13 hours ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

14 hours ago

స్పెషల్ డ్రైవ్ ద్వారా డ్రైను కాలువల పూడికతీత-MHO వెంకటరమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…

14 hours ago

కరెంట్, ఆర్టీసీ,ఇంటి పన్నులు పెంచిన జగన్ దేనికి సిద్దంగా వున్నాడు?-బాలకృష్ణ

అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…

1 day ago

This website uses cookies.