CRIME

ట్రక్కుతో ఢీ కొట్టి డీఎస్పీని దారుణంగా హతమార్చిన మైనింగ్ మాఫియా

అమరావతి: హర్యానాలోని పచగావ్‌ పర్వత ప్రాంతంలో మంగళవారం ఉదయం దారుణ సంఘటన జరిగింది..అక్రమ మైనింగ్ తవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్లిన డీఎస్‌పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్‌‌పై మైనింగ్ మాఫియా ఆయనపై ట్రక్కు ఎక్కించి హతమార్చింది..ఈ సంఘటనలో బిష్ణోయ్ అక్కడికకక్కడే మృతిచెందారు..రాతి గనుల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై డీఎస్​పీ సురేంద్ర సింగ్ విచారణ జరుపుతున్నారు. ఇందులో భాగంగా తావడూ సమీపంలోని పంచగావ్ వద్ద ఉన్న ఆరావళి కొండల వద్ద అక్రమ మైనింగ్​ను అడ్డుకునేందుకు అక్కడికి వెళ్లారు. దారిలో వెళ్తున్న ఓ లారీని ఆపేందుకు డీఎస్​పీ ప్రయత్నించారు.. ట్రక్కు డ్రైవర్ వేగంను తగ్గించ కుండా,ఇంకా వేగం పెంచి వీరి వాహానంపైకి వచ్చాడు.డీఎస్పీతో పాటు వున్న గన్ మోన్,,డ్రైవర్లు వాహనం నుంచి దూకి తప్పించుకున్నారు. ట్రక్కు ఢీకొట్టిన వెంటనే డీఎస్​పీని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని పోలీసుల పేర్కొన్నారు.. ఈ సంఘటనపై సౌత్ రేంజ్ ఐజీపీ రవి కిరణ్ మాట్లాడుతూ, అక్రమ మైనింగ్ సమాచారం అందగానే బిష్ణోయ్ ఆకస్మికంగా తనిఖీకి వచ్చారని, తగిన బందోబస్తు లేకుండా వెళ్లకూడదని, అయితే అందుకు ఆయనకు సమయం లేకపోయి ఉండవచ్చని అన్నారు. నిందితుల్ని పట్టుకునేందుకు ముమ్మరంగా గాలింపులు చేప్పటినట్లు పేర్కొన్నారు..హర్యానా ముఖ్యమంత్రి ఖట్టార్:-డీఎస్‌పీ హత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హర్యానా ముఖ్యమంత్రి ఖట్టార్ ఒక ప్రకటనలో తెలిపారు..డీఎస్‌పీ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు..ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని, అమరవీరునిగా గుర్తిస్తామని తెలిపారు..

(1994లో హరియాణా పోలీసు విభాగంలో చేరారు సురేంద్ర సింగ్ బిష్ణోయ్. అసిస్టెంట్ సబ్ఇన్​స్పెక్టర్​గా విధుల్లో చేరిన ఆయన.. క్రమంగా డీఎస్​పీ స్థాయికి ఎదిగారు.)

Spread the love
venkat seelam

Recent Posts

ఎన్నికలు సజావుగా జరగేందుకు జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలి-మిశ్రా

సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…

1 hour ago

నియంత్రణ కోల్పోయిన అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌

అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ టేకాఫ్‌ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…

2 hours ago

వాటర్ ప్యాకెట్లపై తయారీ, ఎక్స్ పెయిరీ తేదీలు లేకపోతే క్రిమినల్ కేసులే-MHO వెంకట రమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…

7 hours ago

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

1 day ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

1 day ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

2 days ago

This website uses cookies.