AMARAVATHI

ఒకే రోజు రెండు రైలు ప్రమాదలు-తృటిలో తప్పిన ప్రాణ నష్టం

(హౌరా నుంచి వస్తున్న ఫలక్ నామా ఎక్స్ ప్రెస్ లో అగ్రిప్రమాదం చోటు చేసుకోగా,,ఇదే సమయానికి ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న దేవగిరి ఎక్స్ ప్రెస్ కు తృటిలో ప్రమాదం తప్పింది..పట్టాలపై రాళ్లతో నింపిన డ్రమ్మును ఉంచారు.)
హైదరాబాద్: హౌరా నుంచి సికింద్రాబాద్ కు వస్తున్న ఫలక్ నుమాఎక్స్ ప్రెస్ ట్రైయిన్ శుక్రవారం ఉదయం యాద్రాది భువనగిరి జిల్లా పగిడిపల్లి-బొమ్మాయిపల్లి ప్రాంతంకు చేరుకునే సమయానికి అగ్నిప్రమాదంకు గురైంది..రైలు భోగీల నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. S4, S5, S6, S7 అనే నాలుగు బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి. మొదట పొగ రాగానే లోకో పైలట్ గమనించి రైలుని నిలిపివేశారు..రైల్వే సిబ్భంది వెంటనే ప్రయాణికుల్ని దింపేశారు.
రైలు ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు.. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని కొద్ది సేపటి క్రితం రైల్వే అధికారులు తెలిపారు..రైలులో 18 బోగీలు ఉండగా 3 బోగీలు పూర్తి దగ్దం కాగా మరో 4 బోగీలు పాక్షికంగా ధ్వసం అయ్యాయి..ప్రమాదంకు గురైన 7 బోగీలను అక్కడే వదిలి 11 బోగీలతో ఫలక్ నామా ఎక్స్ ప్రెస్ బయల్దేరింది..రైలు ప్రయాణికులను సురక్షితంగా బస్సుల్లో గమ్యస్థానాలకు తరలించినట్లు తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు..ప్రమాద స్థలంలో ట్రాకులను పునరుద్ధించి, పరిస్థితిని పూర్వస్థితికి తీసుకువచ్చేందుకు పోలీసు, ఫైర్, రైల్వే సిబ్బంది కలిసికట్టుగా పని చేస్తోందని ఆయన తెలిపారు..
బెదిరింపు లేఖ:- దక్షిణ మధ్య రైల్వేకు గుర్తు తెలియని వ్యక్తి ఇటీవల బెదిరింపు లేఖ రాశాడు..అందులో ఒడిశా బాలాసోర్ లాంటి సంఘటన త్వరలోనే తరహాలోనే ప్రమాదం హైదరాబాద్-ఢిల్లీ మార్గంలో జరుగుతుందని హెచ్చరించాడు..ఆగంతకుడి నుంచి దాదాపు నాలుగు రోజుల క్రితం ఈ బెదిరింపు లెటర్ అధికారులకు చేరింది..వెంటనే ఆప్రమత్తమైన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు..ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మూడు రోజుల కిందట రైల్వే అధికారులు తమకు సమాచారం అందించారని నార్త్ జోన్ డీసీపీ చందనాదీప్తి చెప్పారు..లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరు పంపారు అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు..

దేవగిరి ఎక్స్ ప్రెస్:- ముంబై-సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న దేవగిరి ఎక్స్ ప్రెస్ రైలుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కొందరు దుండగులు పట్టాలపై రాళ్లతో నింపిన డ్రమ్మును ఉంచారు. గుర్తించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై అత్యవసర బ్రేకులు వేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లు దక్షిణ మధ్య రైల్వే నాందేడ్ రైల్వే డివిజన్ పీఆర్ వో షిండే తెలిపారు. మహారాష్ట్ర లోని జల్నా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చెప్పారు..ముంబై నుంచి సికింద్రాబాద్ బయలుదేరిన రైలు శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో సతోనా- ఉస్మాన్ పూర్ స్టేషన్ల మధ్య ప్రయాణిస్తున్న సమయంలో పట్టాలపై ఏదో వస్తువు ఉండటాన్ని లోకోపైలట్ గుర్తించారు..దీంతో ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపాడు..అనంతరం కిందకి దిగి చూడగా,,ట్రాక్ మధ్యలో రాళ్లతో నిండిన డ్రమ్ము కనిపించింది..ఈ విషయాన్ని లోకోపైలట్ వెంటనే రైల్వే భద్రతా అధికారులకు సమాచారమిచ్చారు.. దీంతో సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని డ్రమ్మును తొలగించారు..అనంతరం రైలు తిరిగి సికింద్రాబాద్ బయల్దేరింది..ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Spread the love
venkat seelam

Recent Posts

12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగానికి అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…

4 hours ago

క్రేజీ వాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు

అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్‌పై…

4 hours ago

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

1 day ago

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

1 day ago

టీవీ న‌టి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు అంటూ ట్రెడింగ్ అవుతున్న పోస్టు

అమరావతి: కర్ణాటకలో ఇటీవ‌లే ఎం.పీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ స్కాండ‌ల్ ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో…

1 day ago

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు…

1 day ago

This website uses cookies.