NATIONAL

800 కోట్లకు చేరుకున్న ప్రపంచ జనాభా-ప్రస్తుతం భారతదేశం జనాభా 141.2 కోట్లు

అమరావతి: ప్రపంచ జనాభా మంగళవారం నాటికి 800 కోట్లు దాటిందని,ఇది మానవాళి చారిత్రలో ఒక మైలురాయి అని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. వైద్యం,పోషణ, వ్యక్తిగత శుభ్రతతో సహా అనేక రంగాల్లో మానవాళి సాధించిన పురోగతి వల్ల అకాల మరణాలు తగ్గి,,ఆయుర్దాయం గణనీయంగా పెరిగినట్లు వెల్లడించింది. ప్రస్తుతం సంతానోత్పత్తి తగ్గడం  పడిపోతుండటం కారణంగా ప్రపంచ జనాభా పెరుగుదల తగ్గుతున్నట్లు నివేదిక వెల్లడించింది. ఈ జనాభాలో సగం మంది కేవలం 7 దేశాల్లోనే ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్‌ నివేదిక పేర్కొంది.చైనా,భారత్,అమెరికా,పాకిస్తాన్,నైజీరియా,బ్రెజిల్ లో ప్రస్తుతం అధిక జనాభా నమోదు అవుతున్నట్లు వెల్లడించింది.1990 నుంచి అయుర్దాయం పెరుగుతొందని,2019 నుంచి సగటు వ్యక్తి ఆయుర్దాయం 72.8 కాగా అధునిక వైద్యం సేవాలు పెరగడంతో 2050 నాటికి ఆయుర్దాయం 77.2 కు చేరుకుంటుందని ఐరాస ప్రకటించింది.ఇదే సమయంలో కొన్ని కారణల వల్ల సంతానోత్పత్తి తగ్గడంతో ప్రపంచ జనాభా పెరుగుదల నెమ్మదించిందని తెలిపింది.రాబోయే రోజుల్లో 100 కోట్ల జనాభా పెరుగుదల కాంగో,ఈజిప్ట్,ఇథియోపియా,భారత్,నైజీరియా,పాకిస్తాన్,ఫిలిప్పిన్స్,టాంజానియా దేశాల్లో వుంటుందని పేర్కొంది.ప్రస్తుతం అత్యధిక జనాభా కలిగిన దేశంగా వున్న చైనాను,వచ్చే సంవత్సరం నాటికి భారత్ అధికమిస్తుందని తెలిపింది.ప్రస్తుతం భారతదేశంలో 141.2 కోట్ట మంది వుండగా,2050 నాటికి దాదాపు 170 కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది.205 నాటికి చైనా జనాభా 130 కోట్లకు చేరుకోవచ్చని పేర్కొంది.వేగంగా పెరిగే జనాభా కారణంగా పేదరికం,ఆకలి సంక్షోభం,పోషకాహారలోపం,విద్య,వైద్యంలో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొవల్సి వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.

Spread the love
venkat seelam

Recent Posts

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

7 hours ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

7 hours ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

1 day ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

1 day ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

1 day ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

1 day ago

This website uses cookies.