AMARAVATHICRIME

బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా ఆఫ్ఘనిస్థాన్ అంబాసిడర్

అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్ పదవీకి రాజీనామ చేయాల్సి వచ్చింది.. ఏకంగా రూ.18.6 కోట్ల విలువైన 25 కేజీల బంగారాన్ని అక్రమంగా విదేశాల నుంచి భారత్‌కు తీసుకొచ్చి వార్తల్లో నిలిచారు..అమె ఆఫ్ఘనిస్థాన్ అంబాసిడర్ హోదాలో వున్న (భారత్‌లోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ కాన్సుల్ జనరల్) జకియా వార్దక్‌(58)..గత నెల 25వ తేదీ సాయంత్రం 5:45 గంటల సమయంలో ఎమిరేట్స్‌ ఫ్లైట్‌లో కుమారుడితో కలిసి దుబాయ్‌ నుంచి భారత్‌ కు చేరుకున్నారు..ముంబైలోని చత్రపతి ఇంటర్నషనల్ ఎయిర్‌పోర్ట్‌ లో ల్యాండ్‌ అవ్వగానే ఆమె అంబాసిడర్ హోదాలో గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా ఎయిర్‌పోర్ట్‌ బయటకు వచ్చారు..వార్దక్‌ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (D.R.I)కు ముందుగానే సమాచారం అందింది..

దౌత్యవేత్త కావడంతో ఆమెకు తనిఖీల నుంచి మినహాయింపు ఇచ్చారు..అమె ఎయిర్‌పోర్ట్‌ ఎగ్జిట్‌ వద్ద డీఆర్‌ఐ అధికారులు ఆమెను అడ్డుకుని స్మగ్లింగ్‌ గురించి వాకబు చేశారు.. బంగారం ఇతర వస్తువులేవైనా తీసుకెళ్తున్నారా అని ఆమెను ప్రశ్నించగా, అందుకు ఆమె అలాంటివేమీ తమ వద్ద లేవని సమాధానం ఇచ్చారు..దీంతో అధికారులు వార్దక్‌ను ఓ గదిలోకి తీసుకెళ్లి మహిళా అధికారులతో తనిఖీలు చేయించగా, ఆమె బండారం మొత్తం బయటపడింది..ఈ తనిఖీల్లో ఆమె ధరించిన జాకెట్‌, లెగ్గిన్‌, మోకాలి క్యాప్‌లో ఏకంగా 25 బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి.. ఆమె కుమారుడి వద్ద మాత్రం ఎలాంటి బంగారం కనిపించలేదు.. దౌత్యవేత్త బంగారం స్మగ్లింగ్‌ చేయడం చూసి అధికారులు ఒక్కసారిగా అవాక్కైయ్యారు..బంగారానికి సంబంధించి సరైన పత్రాలు చూపించాల్సిందిగా వార్దక్‌ను, డీఆర్‌ఐ అధికారులు అడగ్గా,, ఆమె చూపించలేకపో దీంతో ఆ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.. ఆఫ్ఘాన్‌ దౌత్యవేత్తపై కస్టమ్స్‌ చట్టం, 1962 కింద బంగారం స్మగ్లింగ్‌ కేసు నమోదు చేశారు..అయితే వార్దాక్‌కు దౌత్యపరమైన రక్షణ ఉండటంతో ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేయకుండా పంపించి వేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *