AMARAVATHIINTERNATIONAL

ఇజ్రాయెల్ పై 20 నిమిషాల్లో 5 వేల రాకెట్ దాడులు చేసిన హమాస్ సంస్థ

యుద్దం మొదలైంది..ప్రతీకారం తీర్చుకుంటాం..ప్రధాని బెంజిమెన్
అమరావతి:, పాలస్తీనా మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ మీద 20 నిమిషాల వ్యవధితో దాదాపు 5000 రాకెట్లు ప్రయోగించబడ్డాయి.. ఇజ్రాయెల్ పై హమాస్ ఆపరేషన్ అల్-అక్సా ఫ్లడ్ ప్రారంభించింది..హమాస్ దాడిలో ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 22 మంది మరణించారు..మృతుల్లో షార్ హనెగెవ్ రీజియన్ మేయర్ కూడా ఉన్నారు.. గాజా స్ట్రిప్ నుంచి రాకెట్ దాడి అనంతరం హమాస్ సంస్థకు చెందిన వ్యక్తులు ఇజ్రాయెల్ లోకి చొరబడ్డారని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పేర్కొంది..
          శనివారం తెల్లవారుజామున గాజా స్ట్రిప్ నుంచి రాకెట్లను ప్రయోగించారు.. కుసేఫ్ నగరంలో రాకెట్ల వర్షం కురిసిందని, దీంతో అనేక మంది గాయపడ్డారని కుసేఫ్ మేయర్ అబ్ద్ అల్-అజీజ్ నసారా మీడియా సంస్థలకు తెలిపారు..కుసేఫ్ దక్షిణ ఇజ్రాయెల్ లోని ఒక నగరం, ఇది గాజా స్ట్రిప్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది..దాడి తరువాత గాజా స్ట్రిప్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెల్ అవీవ్ తో పాటు అలాగే దక్షిణాన ఉన్న సే బోకర్, అరద్, డిమోనలలో రెడ్ అలర్ట్ హెచ్చరిక సైరన్ లు మోగాయి..
          ఇజ్రాయెల్ పై యుద్ధాన్ని ప్రారంభించడం ద్వారా హమాస్ తీవ్రమైన తప్పు చేసిందని,, పాలస్తీనాలోని హమాస్ సంస్థపై ప్రతీకారం తీర్చుకుంటామని,, యుద్ధం మొదలైనట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నేత్యన్యాహూ స్పష్టం చేశారు.. ఇజ్రాయెల్ సైనికులు చొరబాటు దారు ప్రవేశించిన అన్ని ప్రదేశాలలో శత్రువులతో పోరాడుతున్నారని,,ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ విజయం సాధిస్తుందని రక్షణ మంత్రి యోవ్ గాలంట్ విశ్వాసం వ్యక్తం చేశారు..ఇజ్రాయెల్ దేశ దక్షిణ భాగం సహా మధ్య భాగంలో నివసించే ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టకుండా సురక్షిత ప్రదేశాలలో ఉండాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
          భారత ప్రభుత్వం,,సురక్షిత ప్రాంతాల్లో:- ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్దం మొదలైన నేపథ్యంలో ఇజ్రాయెల్ లో నివసిస్తున్న భారతీయ పౌరులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది.. ఇజ్రాయెల్ లో నివసిస్తున్న భారతదేశ పౌరులు జాగ్రత్తగా ఉండాలని,,భారత పౌరులు అనవసరమైన కార్యకలాపాలకు దూరంగా ఉంటూ సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని ప్రభుత్వం సూచించింది..స్థానిక అధికారులు,,భారతదేశ పౌరుల పట్ల భద్రతా ప్రోటోకాల్ లను అనుసరించాలని ఇజ్రాయెల్ ను భారత ప్రభుత్వం కోరింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *