DISTRICTS

వ్యవసాయ విశ్వవిద్యాలయాల కృషి ఫలితంగా నేడు ఆహార ధాన్యాలు ఎగుమతి చేస్తున్నాం-షెకావత్

తిరుపతి: వ్యవసాయ రంగంలో వివిధ పంటలలో సాంకేతికంగా నూతన వంగడాలను రూపొందించడం దేశ ఆహార భద్రతను సాదించడంలో వ్యవసాయ రంగం ముఖ్య పాత్ర పోషించిందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. బుధవారం స్థానిక శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఆడిటోరియ౦లో ఆచార్య ఎన్.జి రంగ వ్యవసాయ విశ్వ విద్యాలయ ఆద్వర్యంలో పాల్గొని ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి కాకాని గోవర్దన రెడ్డి, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుతో కలిసి అధ్యాపకులు, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమoలో పాల్గొన్నారు.

                ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ,ఆచార్య ఎన్.జి రంగ వ్యవసాయ విశ్వ విద్యాలయం వారి ఆద్వర్యంలో గౌరవ డాక్టరేట్ అందుకోవడం నా జీవితంలో మరిచిపోని రోజుగా మిగిలిపోతుంది అని అన్నారు. డాక్టరేట్ ఇచ్చిన ఆచార్య ఎన్.జి రంగ వ్యవసాయ విశ్వ విద్యాలయ సిబ్బంధికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. వ్యవసాయ రంగ అభివృద్దికి వ్యవసాయ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్తలు, సిబ్బంది ఎంతో కృషి చేశారని, దేశంలో 74  వ్యవసాయ విశ్వ విద్యాలయాల్లో ఆచార్య ఎన్.జి రంగ విశ్వ విద్యాలయం 11 వ స్థానంలో ఉందని చెప్పడానికి చాలా గర్వంగా ఉందని తెలిపారు. వ్యవసాయ రంగంలో వివిధ పంటలలో సాంకేతికంగా నూతన వంగడాలను రూపొందించడం దేశ ఆహార భద్రతను సాదించడంలో వ్యవసాయ రంగం ముఖ్య పాత్ర పోషించిందని, దేశంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు కృషి ఫలితంగా మన దేశం ఆహార దాన్యాల ఉత్పత్తిలో స్వయం సంవృద్దిని సాదించడమే కాక ఆహార ధాన్యాలు వివిధ పంటల ఉత్పత్తులను ఎగుమతి చేయడం జరుగుతోందని తెలిపారు. వ్యవసాయ రంగంలో మనం సాధించిన ప్రగతి ప్రపంచ దేశాల్లో ఆహార ఉత్పతుల కొరకు మన దేశం వైపు చూసేలా చేయడం గర్వించదగ్గ విషయమని, అభివృద్ది చెందిన దేశంగా భారత్ అవతరించేలా వ్యవసాయ రంగ పాత్ర కీలకమైందని తెలిపారు.            

               మంత్రి కాకాణీ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యవసాయ రంగ అభివృద్దిలో ఆచార్య ఎన్.జి.రంగ విశ్వ విద్యాలయం ముఖ్య పాత్ర పోషిస్తోందని తెలిపారు. బి.పి.టి- 5204(సాంబా మహసూరి), ఎం.టి.యు 7029(స్వర్ణ), ఎం.టి.యు 1001(విజేత) వంటి రకాలు దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయనీ, దేశంలోనే మొదటి సారిగా వ్యవసాయ రంగంలో డ్రోన్ ల వినియోగం వంటి నూతన విధానాలను ప్రవేశ పెట్టి అనేక విప్లవాత్మక మార్పులకు నాంది పలికిందని తెలిపారు.

తొలుత శ్రీ వేంకటేశ్వర వెటరినరీ యూనివర్సిటీలో ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వద్యాలయం ( ANGRU) వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ కి,, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు.

Spread the love
venkat seelam

Recent Posts

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

20 hours ago

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

21 hours ago

టీవీ న‌టి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు అంటూ ట్రెడింగ్ అవుతున్న పోస్టు

అమరావతి: కర్ణాటకలో ఇటీవ‌లే ఎం.పీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ స్కాండ‌ల్ ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో…

21 hours ago

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు…

23 hours ago

కాబిన్ సిబ్బంది బెదిరింపులపై తీవ్రంగా స్పందించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌

అమరావతి: టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…

1 day ago

ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు బ్రహ్మరథం పట్టిన విజయవాడ ప్రజలు

అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్‌ స్టేడియం…

2 days ago

This website uses cookies.