DISTRICTS

పినాకిని గాంధీ ఆశ్రమం అభివృద్ధికి కోటి రూపాయలు మంజూరు చేస్తాం-కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

నెల్లూరు: పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమాన్ని స్వదేశీ దర్శన్, ప్రసాద్-వారసత్వ ప్రదేశాల అభివృద్ధి అనే రెండు పథకాలు ఉన్నాయని వాటిలో ఏది వీలైతే అది వర్తించేలా కృషి చేస్తామని, ఆశ్రమ కమిటీ సభ్యులైన 12 మంది సభ్యులు ఇందుకోసం  కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తామని తీర్మానం చేసి పంపాలని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.సోమవారం ఒక రోజు పర్యటన నిమిత్తం నెల్లూరుకు సింహపురి ట్రైయిన్ లో నెల్లూరుకు చేరుకున్న కేంద్ర మంత్రి,నగరంలో వివిధ కార్యక్రమంలో పాల్గొన్నారు.తొలుత ప్రెస్ ఇన్పరేమేషన్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన  జర్నలిస్టులకు:- కేంద్ర ప్రభుత్వం ఆమలు చేస్తున్న వివిధ పథకాలపై ఆవగాహన(వార్తలాప్) కార్యక్రమంలో పాల్గొని,జర్నలిస్టులను ఉద్దేశించి ప్రసంగించారు.

జయభారతీ:- ఆసుపత్రిలో నూతనం ఏర్పాటు చేసిన వివిధ సౌకర్యలను పరిశీలించి,అక్కడ చికిత్స పొందుతూన్న రోగులకు పండ్లు అందచేశారు.ఆసుపత్రిలో సౌకర్యాలకు కృషిచేస్తున్న వారిని సత్కరించారు.

ఎమ్మేల్సీ:- టౌన్ హాల్ నిర్వహించిన ఎమ్మేల్సీ అభ్యర్దుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని,కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.దేశ వ్యాప్తంగా బీజెపీ కార్యకర్తల కృషితో నేడు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజెపీ ప్రజా సంక్షేమ కార్యక్రమంలతో పాటు,దేశ అభివృద్దికి ప్రధాని మోదీ నాయకత్వంలో పలు కార్యక్రమాలు చేపడుతుందన్నారు.

పల్లిపాడు :-గాంధీ ఆశ్రమంకు చేరుకున్న కేంద్ర మంత్రి పినాకీని ఆశ్రమంను పరిశీలించారు. స్వాతంత్ర సమరయోధురాలు శ్రీమతి పొనకా కనకమ్మ విగ్రహానికి కూడా ఖద్దరు శాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్బంలో అయన మాట్లాడుతూ గాంధీ ఆశ్రమ కమిటీ సభ్యులు కోరిక మేరకు  కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి ఆశ్రమాన్ని తీసుకుంటే ఎటువంటి దురాక్రమణలు జరగకుండా కట్టడాన్ని పరిరక్షించడం జరుగుతుందన్నారు. అంతవరకు గాంధీ ఆశ్రమాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు.ఆశ్రమాన్ని పరిరక్షించడంతో పాటు  నిర్వహణ, పచ్చదనం పెంపొందించడం విద్యుత్ విద్యుద్దీకరణం వంటి ప్రతి పని కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరుగుతుందన్నారు.

నరసింహకొండ: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న అనేక ప్రముఖ పుణ్యక్షేత్రాలు, దేవాలయాలను అన్ని విధాల అభివృద్ధి పరుస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.సోమవారం రాత్రి నరసింహకొండ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ  పుణ్యక్షేత్రాల్లో భక్తుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగానికి అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…

23 mins ago

క్రేజీ వాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు

అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్‌పై…

25 mins ago

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

1 day ago

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

1 day ago

టీవీ న‌టి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు అంటూ ట్రెడింగ్ అవుతున్న పోస్టు

అమరావతి: కర్ణాటకలో ఇటీవ‌లే ఎం.పీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ స్కాండ‌ల్ ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో…

1 day ago

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు…

1 day ago

This website uses cookies.