AMARAVATHI

6, 7, 8 క్లైయిమ్ ఫారాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, గడువులోగా పరిష్కరించండి

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో జనాభా నిష్పత్తికి తగ్గట్టుగా యువతను ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని, ఎన్నికల సంఘం నిర్దేశాలను పటిష్టంగా పాటించాలని ఎన్నికల అధికారులకు కమిషనర్ వికాస్ మర్మత్ ఆదేశించారు. ఎన్నికల అధికారులు, సూపర్ వైజర్లు, బూత్ లెవెల్ అధికారులతో స్థానిక కస్తూర్భా కళాక్షేత్రంలో సమీక్షా సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అర్హులైన వారందరినీ ఓటర్లుగా నమోదు చేయాలని, క్షేత్ర స్థాయిలో ఓటర్ల జాబితా రూపొందించడంలో బి.ఎల్.ఓ లు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రము పరిధిలో బౌండరీస్ ను కచ్చితంగా నిర్ణయించుకొని, జనాభా నిష్పత్తి, లింగ నిష్పత్తి, కొత్త ఓటర్ల నమోదు, వివిధ క్లయిములను పారదర్శకంగా పరిగణించాలని ఆదేశించారు.

ఓటరును పోలింగ్ కేంద్రం బదిలీ చేసే సందర్భంలో కుటుంబ సభ్యుల వారీగా ఉన్న ఓట్లను విడదీయవద్దని, జనాభాకు తగ్గట్టుగా ఓటర్ల నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలలో నిష్పత్తిని సమం చేసేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. మునిసిపాల్ కార్యాలయానికి పంపించే తొలగింపు ఫారం 7ను సరియైన రిమార్క్స్ తో పాటు తప్పనిసరిగా సాక్షి సంతకాన్ని కూడా సేకరించాలి అని సూచించారు. మాన్యువల్ గా సమర్పించే క్లయిములకు తగిన రసీదులను తప్పనిసరిగా క్లెయిమ్ దారుడు/దారిణి లకు అందించాలని,,ఓటర్ల చేర్పులు, తొలగింపులకు రాజకీయ పార్టీల బి.ఎల్.ఏ లను సమన్వయం చేసుకుని జాబితాలో ఎలాంటి తప్పిదాలు లేకుండా సరిచూసుకోవాలని కమిషనర్ సూచించారు. నగర పాలక సంస్థ పరిధిలోని 6, 7, 8  క్లైయిమ్ ఫారాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సూచించిన గడువులోగా పరిష్కరించాలని కమిషనర్ సూచించారు. ఈ సమావేశంలో ఏ.ఈ.ఆర్.ఓలు నిర్మలానంద బాబా, దేవీ కుమారి, దశయ్య, ధనుంజయులు,  ఈ.డి.టి మాధవి, చక్రపాణి, సూపర్ వైజర్లు, బూత్ లెవెల్ అధికారులు, ఎలక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగానికి అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…

5 hours ago

క్రేజీ వాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు

అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్‌పై…

5 hours ago

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

1 day ago

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

1 day ago

టీవీ న‌టి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు అంటూ ట్రెడింగ్ అవుతున్న పోస్టు

అమరావతి: కర్ణాటకలో ఇటీవ‌లే ఎం.పీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ స్కాండ‌ల్ ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో…

1 day ago

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు…

1 day ago

This website uses cookies.