AMARAVATHI

మే 2 నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం- జనరల్ అబ్జర్వర్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 – నెల్లూరు సిటీ నియోజకవర్గ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ నితిన్ సింగ్ బదౌరి తెలిపారు. రిటర్నింగ్ అధికారి వికాస్ మర్మత్ నేతృత్వంలో స్థానిక కార్పొరేషన్ కమాండ్ కంట్రోల్ విభాగంలో సార్వత్రిక ఎన్నికల అభ్యర్థులతో సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి హ్యాండ్ బుక్, ఐ.డి కార్డులు, ఎలక్షన్ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా జనరల్ అబ్జర్వర్ మాట్లాడుతూ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వివరాలను వెల్లడించాలని, ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సమస్యనైనా తన దృష్టికి తీసుకురావాలని తన ఫోన్ నెంబరును అభ్యర్థులకు ప్రకటించారు. రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ మే నెల 2 వ తేదీ హోమ్ ఓటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని, 5 వ తేదీ వరకు మొత్తం 160 మంది ఓటర్లను వారి గృహల్లోనే ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. అభ్యర్థుల సమక్షంలోనే ఈవీఎం మెషీన్ల కేటాయింపు ప్రక్రియను పారదర్శకంగా చేపడుతామని ఆర్.ఓ తెలిపారు. పోస్టల్ వోటింగ్ ప్రక్రియను కూడా సమర్ధవంతంగా నిర్వహించేలా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, పార్టీల ప్రతినిధులు, ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…

20 hours ago

ఈసీ సస్పెండ్ చేసిన పోలీసు అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగ్ లు

అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…

20 hours ago

బెంగళూరు జరిగిన రేవ్‌ పార్టీలో 100 మంది అరెస్ట్- టీవీ నటీనటులు,మోడల్స్

దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని…

22 hours ago

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి

ఓల్డ్ మోడల్ హెలికాప్ట‌ర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…

22 hours ago

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

2 days ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

2 days ago

This website uses cookies.