AGRICULTURE

పంటలకు మద్దతు ధరలను పెంచిన మోదీ ప్రభుత్వం

అమరావతి: రైతులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది..కనీస మద్దతు ధర రైతులకు గిట్టుబాటు కల్పించడంతో పాటు, పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించేందుకు పలు చర్యలు చేపట్టడడం జరిగిందని కేంద్ర మంత్రి పియూశ్ గోయల్ తెలిపారు..బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ 2023-24 మార్కెటింగ్ సీజన్ కు ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరల పెంపునకు బుధవారం ఆమోదం తెలిపింది…సెంటర్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్(CACP) సిఫారసుల ఆధారంగా వివిధ పంటల కనీస మద్ధతు ధరలను నిర్ణయిస్తామని వివరించారు.. ఈ ఖరీఫ్ సీజన్ లో వరి కనీస మద్ధతు ధరను క్వింటాల్ కు రూ.143 పెంచడంతో ప్రస్తుతం క్వింటాల్ వరి ధర రూ.2,183 కు చేరుకుంది..గతే సంవత్సరం ఇది రూ.2,040 గా ఉంది..పెసర్ల పంటకు అత్యధికంగా కనీస మద్దతు ధరను పెంచారు..ప్రస్తత పెంపుతో పెసర క్వింటాల్ కనీస మద్దతు ధర రూ.8,558 కి చేరింది..గత సంవత్సరం ఖరీఫ్ సీజన్ లో ఇది రూ.7,755 గా ఉంది.. హైబ్రిడ్ జొన్న క్వింటాల్ రూ.3180, జొన్న(మాల్దండి), రూ.3225,, రాగి రూ.3846,, సజ్జలు రూ.2500,, మొక్కజొన్న రూ.2090,, పొద్దు తిరుగుడు(విత్తనాలు) రూ.6760,, వేరుశెనగ రూ.6377,, సోయాబీన్ (పసుపు పచ్చ) రూ.4600,, పత్తి(మధ్యస్థాయి పింజ) రూ.6620,, పత్తి (పొడవు పింజ) రూ.7020 చొప్పున ఈ సీజన్ లో ఇవ్వనున్నట్టు మంత్రి తెలిపారు..

Spread the love
venkat seelam

Recent Posts

ఎన్నికలు సజావుగా జరగేందుకు జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలి-మిశ్రా

సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…

2 hours ago

నియంత్రణ కోల్పోయిన అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌

అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ టేకాఫ్‌ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…

3 hours ago

వాటర్ ప్యాకెట్లపై తయారీ, ఎక్స్ పెయిరీ తేదీలు లేకపోతే క్రిమినల్ కేసులే-MHO వెంకట రమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…

8 hours ago

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

1 day ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

1 day ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

2 days ago

This website uses cookies.