AMARAVATHI

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డును అందుకున్న RRR సినిమా

అంతర్జాతీయస్థాయి సినిమాలు-రాజమౌళి

హైదరాబాద్: RRR సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు వస్తునే వున్నాయి.. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో RRR సినిమాను 5 అవార్డులు వరించాయి..త్వరలో ఆస్కార్ అవార్డు కార్యక్రమం ఉండటంతో పాటు, RRR ని హాలీవుడ్ లో రీ రిలీజ్ చేస్తుండటం, ఇంకొన్ని అవార్డు వేడుకలు ఉండటంతో ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్.. మరికొంతమంది RRR యూనిట్ అమెరికాలోనే ఉంటూ ఆ కార్యక్రమాలలో పాల్గొంటూ RRRని మరింత ప్రమోట్ చేస్తున్నారు..ఈ నేపధ్యంలో,, విదేశాల్లో శైతం విశేష ప్రజాదరణ పొందిన చిత్రంగా RRR సినిమాకు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (HCA) స్పాట్ లైట్ అవార్డు ప్రకటించారు..లాస్ ఏంజెల్స్ లోని Beverly Wilshire Hotelలొ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల కార్యక్రమం శుక్రవారం రాత్రి జరిగింది..ఈ అవార్డు వేడుకల్లో RRR సినిమాకు ‘బెస్ట్‌ స్టంట్స్‌’,, ‘బెస్ట్‌ యాక్షన్‌ మూవీ’,, ‘బెస్ట్‌ ఒరిజినల్ సాంగ్‌’(నాటు నాటు),, ‘బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్’ విభాగాల్లో నాలుగు అవార్డులతో పాటు స్పాట్ లైట్ అవార్డుతో కలిపి మొత్తం హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో 5 అవార్డుల్ని RRR సినిమా సొంతం చేసుకుంది.. అవార్డులను రాజమౌళి,, కీరవాణి అందుకున్నారు..రాజమౌళి హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులను అందుకొన్న సందర్బంలో రాజమౌళి మాట్లాడుతూ, ఇన్ని అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉంది..ఈ అవార్డులతో మేము ఇంకా పైకి ఎదగగలం అని భావిస్తున్నాము..RRR సినిమాకు బెస్ట్ స్టంట్స్‌ అవార్డుని, బెస్ట్ యాక్షన్ ఫిలిం అవార్డుని అందించిన HCA కు ధన్యవాదాలు.

Spread the love
venkat seelam

Recent Posts

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను సజావుగా ఉపయోగించుకుంటున్న ఉద్యోగులు-కలెక్టర్

అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…

9 mins ago

జగన్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిపోయింది-షర్మిలా

నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…

20 hours ago

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

23 hours ago

డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదలీ వేటు

అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…

23 hours ago

ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ కు 8వ తేదీ వరకు ఓటింగ్‌కు అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్‌ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ…

24 hours ago

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

2 days ago

This website uses cookies.