DISTRICTS

అభివృద్ది కార్యక్రమాల కోసం ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలు-మంత్రి అంబటి

నెల్లూరు: జిల్లాను అభివృద్ది పధంలోకి తీసుకురావడానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి, జిల్లా ఇన్ చార్జి మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.శనివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ది కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలో అమలు అవుతున్న పనుల పురోగతిపై మంత్రి అంబటి,జిల్లా మంత్రి కాకాణి,కలెక్టర్ చక్రధర్ బాబులతో కలసి సమీక్షిండంతో పాటు శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు సమావేశం దృష్టికి తీసుకు వచ్చిన పలు సమస్యలను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించడం జరిగింది.

ఈ సంధర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ సెప్టెంబర్ మొదటి వారంలో నెల్లూరు బ్యారేజి,మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ లను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి తెలిపారు.ప్రజలు కోరుకున్న అభివృద్ది కార్యక్రమాలను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం  ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని, అలాగే ప్రతి శాసన సభ్యునికి రెండు కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. మంత్రి కాకాణి మాట్లాడుతూ, ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పధకాలను పారదర్శకంగా అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.శాసన సభ్యులు తెలిపిన సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం,  పరిష్కరించలేని సమస్యలను ఏ కారణం వలన పరిష్కరించలేకపోవడం జరిగిందో  తెలియచేయడం జరుగుతుందన్నారు. తొలుత జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ, జిల్లాలో వ్యవసాయ రంగానికి, సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూఆయా రంగాల అభివృద్దికి కృషి చేయడం జరుగుచున్నదన్నారు.పరిపాలన వికేంధ్రీకరణలో భాగంగా  కొత్తగా జిల్లాలు ఏర్పడిన తరువాత జనాభాలో అత్యధిక జనాబా కలిగి, రెండు ప్రధాన జలాశయాలు, ప్రధాన ఓడ రేవులతో  అత్యంత ప్రాధాన్యత కల్గిన జిల్లాగా ఏర్పడిందన్నారు. 

Spread the love
venkat seelam

Recent Posts

జగన్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిపోయింది-షర్మిలా

నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…

12 hours ago

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

15 hours ago

డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదలీ వేటు

అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…

15 hours ago

ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ కు 8వ తేదీ వరకు ఓటింగ్‌కు అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్‌ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ…

16 hours ago

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

2 days ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

2 days ago

This website uses cookies.