INTERNATIONAL

బ్రిటీషర్లు వాలసవాద మనస్తత్వం ప్రదర్శించిన  BBC డాక్యుమెంటరీ

భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తప్పుడు ప్రచారం..

అమరావతి: భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై BBC  ప్రసారం చేసిన డాక్యుమెంటరీ సిరీస్‌పై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది..అపఖ్యాతిపాలు చేసే కథనాన్ని ప్రచారం చేయడం కోసమే ఈ విశ్వసనీయత లేని డాక్యుమెంటరీని ప్రసారం చేశారని దుయ్యబట్టింది. బ్రిటన్‌లోని అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో జాత్యహంకారం,,వలసవాద మనస్తత్వం ఆలోచనా ధోరణి వెల్లడి అయిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి చెప్పారు..గురువారం అయన మీడియాతో మాట్లాడారు..ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ,  బ్రిటన్ అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీ షో జాత్యహంకారం,,వలసవాద ఆలోచనా ధోరణిని వెల్లడిస్తోందని బాగ్చి అన్నారు..విశ్వసనీయత లేని కథనంతో విషబీజాలు ప్రజల్లో మనసుల్లోకి చొప్పించాలనే లక్ష్యంతో రూపొందించిన,,తప్పుదారి పట్టించే,,పక్షపాతంతో కూడిన ప్రచారమని ఆరోపించారు..పక్షపాతం నిష్పాక్షికత లేకపోవడం,, వలసవాద ఆలోచనా ధోరణిని యథేచ్ఛగా కొనసాగించడం ఆలస్యంగా అయిన బ్రీటీషర్స్ మనస్తత్వం స్పష్టం చేస్తుందన్నారు..ఇటువంటి కథనాన్ని ప్రచారం చేయడంలో బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (BBC), వ్యక్తుల ధోరణి కనిపిస్తోందని,,ఇలాంటి డాక్యూమెంటరీ ప్రసారం చేయడంలో తెరవెనుక వున్న ఎజెండా ఏమిటని ప్రశ్నించారు..గౌరవ, మర్యాదలతో పని చేయాలని కోరుకుంటున్నామన్నారు..ఈ డాక్యుమెంటరీలో బ్రిటన్ మాజీ సెక్రటరీ జాక్ స్ట్రా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ,,జాక్ స్ట్రా ఏదో అంతర్గత బ్రిటన్ నివేదికను ప్రస్తావించినట్లు కనిపిస్తోందని,,అది తనకు ఏవిధంగా అందుబాటులో ఉంటుందని ప్రశ్నించారు.. గుజరాత్ లో ఇరవయ్యేళ్ళ క్రితంనాటి నివేదిక అని,, దానిపైన భారతదేశం ఎందుకు స్పందించాలని ప్రశ్నించారు..బ్రిటీషర్, జాక్ చెప్పినంత మాత్రానికి అది సరైనదని వారు ఎలా చెప్పగలరని నిలదీశారు… ఎంక్వైరీ,,ఇన్వెస్టిగేషన్ అనే మాటలను తాను విన్నానని,, వలసవాద ఆలోచనా ధోరణి అనే పదాలను మనం మాట్లాడటానికి ఓ కారణం ఉందని తెలిపారు..మనం పదాలను ఇష్టానుసారం వాడబోమన్నారు.. ఎంక్వైరీ ఏమిటి ? వారు అక్కడ దౌత్యవేత్తలు కదా ? ఇన్వెస్టిగేషన్ అంటే భారతదేశాన్ని వారు పాలిస్తున్నారా ? అని ప్రశ్నించారు..

(బ్రిటన్ నేషనల్ బ్రాడ్‌కాస్టర్ బీబీసీ (BBC) మోదీపై రెండు భాగాలుగా ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది..2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్ల సమయంలో మోదీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్తూ,, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంపై ఈ డాక్యుమెంటరీలో విమర్శలు చేసింది..దీంతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది..కొన్ని ప్లాట్‌ఫామ్‌ల నుంచి దీనిని తొలగించారు..భారతీయ మూలాలుగల బ్రిటన్ పౌరులు ఈ డాక్యుమెంటరీని తీవ్రంగా ఖండించారు..ప్రముఖ బ్రిటన్ పౌరుడు లార్డ్ రమి రేంజర్ మాట్లాడుతూ, 100 కోట్ల మందికిపైగా గల భారతీయుల మనసును బీబీసీ తీవ్రంగా గాయపరిచిందన్నారు.)

Spread the love
venkat seelam

Recent Posts

వైసీపీ ఎం.పీలు,ఎమ్మేల్యేలు జగన్ కాలి క్రింద చెప్పులే-అంబటి

అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…

9 hours ago

122 సంవత్సరాల తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు

అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్‌లో వడగాలులు…

17 hours ago

దక్షిణ చైనాలో కుప్పకూలిన వంతెనలో కొంత భాగం-19 మంది మృతి

అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…

2 days ago

నెల్లూరు పార్లమెంటుకు 14 మంది-అసెంబ్లీలకు 115 మంది అభ్యర్థులు-కలెక్టర్‌

మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…

3 days ago

ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన ఎన్డీఏ కూటమి

అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…

3 days ago

మే 2 నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం- జనరల్ అబ్జర్వర్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…

3 days ago

This website uses cookies.