AMARAVATHI

బానిసత్వ కాలంలో భారతదేశాన్ని కొత్త శక్తిని నింపిన గొప్ప వ్యక్తి-ప్రధాని మోదీ

10 రోజుల పాటు దేశంలోని అన్ని ఆలయాలను..
అమరావతి: అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా రానున్న10 రోజులపాటు దేశంలోని అన్ని ఆలయాలను శుభ్రం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంను పురస్కరించుకుని శుక్రవారం నుంచి 11 రోజులపాటు “అనుష్టాన్”(ప్రత్యేక జపం) పాటించనున్నట్లు ప్రధాని మోదీ ఆడియో సందేశంలో తెలిపారు..ఇందులో ప్రధాని మాట్లాడుతూ “అయోధ్య బాలరాముడి ప్రారంభోత్సవం శుభపరిణామం…ఆ రోజు చారిత్రక ఘట్టం ఆవిష్కృతమవబోతోంది…ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నా సమక్షంలో జరగడం…కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు నెరవేర్చడానికి భగవంతుడు నన్ను పుట్టించినట్లుగా భావిస్తున్నాను…ఈ ఘట్టం నన్ను ఎంతో భావోద్వేగానికి గురి చేస్తోంది…నా జీవితంలో తొలిసారి ఇలాంటి అనుభూతిపొందుతున్నాను…అయోధ్య ప్రారంభోత్సవం ప్రపంచమంతటికీ పవిత్రమైన సందర్భం… రాముడిపై అన్ని ప్రాంతాల్లో భక్తిభావం పొంగి పొర్లుతుంది” అని ఆడియోలో పేర్కొన్నారు..
స్వచ్ఛత అభియాన్:- స్వచ్ఛత అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్ర నాసిక్ లోని కాలరామ్ ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు..దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలని ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు..
స్వామి వివేకానంద జయంతి:- శుక్రవారం మహారాష్ట్రలోని నాసిక్ లో పర్యటించిన సందర్బంలో రామ్ కుండ్ తోపాటు శ్రీ కాలరామ్ ఆలయంలో ప్రార్థనలు చేశారు.. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నాసిక్ లో జాతీయ యువజనోత్సవాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి,, భారతదేశ యువశక్తి దివాస్ గా జరుపుకుందామన్నారు.. బానిసత్వ కాలంలో భారతదేశాన్ని కొత్త శక్తిని నింపిన గొప్ప వ్యక్తికి అంకితం చేస్తామని ప్రధాని పిలుపునిచ్చారు..స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అందరి మధ్య, అందులోనూ నాసిక్ లో ఉండటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు..

Spread the love
venkat seelam

Recent Posts

పీఠాపురం చేరుకున్న సురేఖ,రామ్‌ చరణ్-పవన్ కల్యాణ్ ని గెలిపించండి

అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…

23 mins ago

ఓటరు అసిస్టెంట్‌ బూత్‌ల ఏర్పాటు-మే 13న పోలింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు-కలెక్టర్‌

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్‌…

49 mins ago

12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగానికి అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…

20 hours ago

క్రేజీ వాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు

అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్‌పై…

20 hours ago

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

2 days ago

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

2 days ago

This website uses cookies.