NATIONAL

సరిహద్దులో భారీగా డ్రోన్లు, యుద్ధ విమానాలను మోహరిస్తున్న చైనా

అమరావతి: టిబెట్​లోని బాంగ్డా,,లాసా,, షిగాత్సే ప్రాంతాల్లో ఉన్న తన వైమానిక స్థావరాలను అత్యాధునిక డ్రోన్లు, యుద్ధ విమానాలతో నింపుతోంది..ఈ ప్రాంతాలు భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉన్న వైమానిక స్థావరాలు.. అరుణాచల్​ ప్రదేశ్​ లోని తవాంగ్​ సెక్టార్​ వద్ద డిసెంబరు 9వ తేదిన భారత బలగాలతో ఘర్షణ జరిగిన నేపథ్యంలో బార్డర్​ లో, చైనా దూకుడు పెంచింది..ఈ వైమానిక స్థావరాలలో పెద్ద సంఖ్యలో  ‘WZ-7 సోరింగ్​ డ్రాగన్​’  రకం డ్రోన్లు,, ‘సుఖోయ్​ SU 27’ రకం యుద్ధ విమానాలను చైనా మోహరించిందని నిర్ధారించే పలు శాటిలైట్​ దృశ్యాలతో తాజాగా కథనాలను పలు మీడియా సంస్థలు ప్రచురించాయి..ఈ ఉపగ్రహ చిత్రాలు డిసెంబరు 14వ తేది నాటివని పేర్కొన్నాయి..ఇటీవల కాలంలో అరుణాచల్​ ప్రదేశ్​ లోని భారత గగన తలంలో చైనా విమానాలు చక్కర్లు కొడుతూ రెండుసార్లు భారత సైన్యం కంటపడ్డాయి..ఈ సమయంలో టిబెట్​ లోని ఎయిర్​ బేస్​ లలో చైనా ఆయుధ సంపత్తి మోహరించిందనే వార్తలు బయటికి రావడం కలకలం సృష్టిస్తోంది..డ్రోన్లు,,యుద్ధ విమానాలతో నిండుగా ఉన్న టిబెట్​ లోని బాంగ్డా,, షిగాత్సే ఎయిర్​ బేస్​ భారత్​ లోని అరుణాచల్​ ప్రదేశ్​ సరిహద్దుకు కేవలం 150 కిలోమీటర్ల దూరంలోనే ఉంది..టిబెట్​ లోని లాసా ఎయిర్​ బేస్​ నుంచి భారత్ సరిహద్దులు​ 260 కిలోమీటర్ల దూరంలో ఉంది.. లాసాలో ఉన్న ఎయిర్​ బేస్​ విస్తరణ పనులను చైనా ప్రారంభించినట్లు శాటిలైట్​ ఫొటోల్లో స్పష్టం కన్పిస్తొంది..అక్కడ రెండో విమాన రన్​ వేను చైనా నిర్మిస్తున్నట్లు సమాచారం..బాంగ్డా,,లాసా,, షిగాత్సే వైమానిక స్థావరాలలో చైనా సిద్ధంగా ఉంచిన డ్రోన్ల జాబితాలో ‘WZ-7 సోరింగ్​ డ్రాగన్​’  అనే అత్యాధునిక డ్రోన్లు ఉన్నట్లు ఫోటోల్లో వెల్లడైంది..నిర్విరామంగా గగనతలంలో 10 గంటల పాటు పహారా కాస్తూ ఎగరగల సామర్థ్యం ‘WZ-7 సోరింగ్​ డ్రాగన్​’  కు ఉంది..ఈ డ్రోన్​ నిర్దేశిత ప్రదేశాల గగన తలంలో తిరుగుతూ అక్కడి మ్యాపింగ్​,, ఇమేజెస్​ ను సైనిక స్థావరానికి చేరవేస్తుంది..ఇది పంపించే మ్యాపింగ్​, ఇమేజెస్​ ఆధారంగా,, లక్ష్యం ఎంత దూరంలో ఉందనే దానిపై ఒక స్పష్టతతో సైన్యం క్షిపణులను ప్రయోగిస్తుంది.

Spread the love
venkat seelam

Recent Posts

దక్షిణ చైనాలో కుప్పకూలిన వంతెనలో కొంత భాగం-19 మంది మృతి

అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…

2 hours ago

నెల్లూరు పార్లమెంటుకు 14 మంది-అసెంబ్లీలకు 115 మంది అభ్యర్థులు-కలెక్టర్‌

మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…

1 day ago

ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన ఎన్డీఏ కూటమి

అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…

1 day ago

మే 2 నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం- జనరల్ అబ్జర్వర్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…

1 day ago

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎదురు కాల్పులు-7 మావోయిస్టులు హతం

అమరావతి: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో పోలీసుల‌కు, మావోయిస్టుల‌కు మ‌ధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హ‌త‌మ‌య్యారు.. నారాయ‌ణ్‌పూర్‌, కాంకేర్…

1 day ago

ఎన్నికలు సజావుగా జరగేందుకు జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలి-మిశ్రా

సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…

2 days ago

This website uses cookies.