DEVOTIONAL

గరుడ సేవకు వేళ్ళు భక్తులు వెహికాల్స్ పాసులు తీసుకొని వెళ్ళాలి-తిరుపతి ఎస్పీ

పాస్ లు పూర్తిగా ఉచితం..

తిరుపతి: 1వ తేదీ శనివారం శ్రీవారి గరుడ సేవ రోజున ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని, దీనికి స్థానిక ప్రజలు, భక్తులు,వాహనదారులు పోలీసు వారికి సహకరించాలని జిల్లా ఎస్పీ పి.పరమేశ్వరరెడ్డి IPS విజ్ఞప్తి చేశారు. పాసులు పూర్తిగా ఉచితముగా ఇవ్వబడును ఎలాంటి రుసుము చెల్లించిన అవసరం లేదని,,తిరుమల గరుడసేవలకు వచ్చే భక్తులు తమ యొక్క వాహన కార్ పాసులను ఏర్పాటుచేసిన సెంట్రల్ వద్ద ఈ క్రింది ప్రాంతాలలో పొందగలరన్నారు.

1-కడప జిల్లా వైపు నుంచి వచ్చే భక్తులు కుక్కల దొడ్డి వద్ద గల కేశవరెడ్డి  హై స్కూల్, కరకంబాడి రోడ్డు నందు గల అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీ వద్ద పాసులు పొందగలరు.

2- నెల్లూరు వైపు నుంచి వచ్చే వాహనాలు ఏర్పేడు వద్ద గల శ్రీ ఇంజనీరింగ్ కాలేజీ నందు పాసులు ఇవ్వడం జరుగుతుంది.

3-చెన్నై వైపు నుంచి వచ్చు వాహనాలు ఆగస్త్య ఎన్ క్లేవ్ నియర్ టోల్ ప్లాజా (వడమలపేట) వద్ద పాసులు ఇవ్వడం జరుగుతుంది.

4-చిత్తూరు వైపు నుంచి వచ్చే వాహనములకు ఐతే పల్లి దగ్గర అగ్రికల్చరల్ ల్యాండ్స్ నందు పాసులు ఇవ్వబడును.

5-మదనపల్లి నుంచి వచ్చు వాహనములకు శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద పాసులు ఇవ్వడం జరుగుతుంది.

6-తిరుపతి టౌన్ లో ఉన్నటువంటి భక్తులకు నాలుగు ప్రాంతాల్లో పాసులు ఇవ్వడం జరుగుతుందని అవి,,1-భారతీయ విద్యా భవన్…2-జూ పార్కు దగ్గర ఉన్నటువంటి దేవ లోక్…3-ఎస్.వి ఇంజనీరింగ్ కాలేజ్ కరకంబాడి రోడ్డు…4-శ్రీ అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజ్ కరకంబాడి రోడ్డు నందు పాసులు ఇవ్వడం జరుగుతుంది.

ద్విచక్ర వాహనాలు నిషేధం:- శ్రీవారి గరుడ సేవకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే ఆస్కారం ఉన్నందున ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా,, సురక్షితమైన  ప్రయాణం కోసం తిరుమలకు ద్విచక్ర వాహనాలను కూడా నిషేధించడం జరిగింది..ద్విచక్ర వాహనాలను 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 2వ తేదీ ఉదయం వరకు నిషేధం ఉంటుందని ప్రజలు ఈ విషయాన్ని గమనించి పోలీసు వారికి సహకరించాలన్నారు.

టూరిస్ట్ బస్సుల వాహనాల పార్కింగ్ లు ఈ క్రింది విధంగా:-

1)-”దేవలోక్  పార్కింగ్ :- టూరిస్ట్ బుస్సులకు టిటిడి వారు నిర్ణయించిన పరిమితికి మించి ఎక్కువ సీటింగ్ కెపాసిటీ కలిగిన వాహనాలు టెంపో ట్రావెలర్, మెట్టడోర్ మొదలైనవి చెర్లోపల్లి నుంచి జూ పార్క్ కి సమీపం లో ఉన్న“దేవలోక్” పార్కింగ్ స్థలము…

2)-భారతీయ విద్యా భవన్ స్కూల్ గ్రౌండ్:- కార్లు, జీపులు మొదలైన చిన్నవాహనాలు సైన్స్ సెంటర్ కు ఏదురుగా ఉన్న భారతీయ విద్యా భవన్ స్కూల్ గ్రౌండ్ స్థలము.

3)-ద్విచక్ర వాహనాలు కొరకు:-1-అలిపిరి గరుడ కూడలి వద్ద ఉన్న పాత చెక్ పాయింట్…2- ISKON గుడి ఏదురుగా ఉన్న గ్రౌండ్…3-మెడికల్ కాలేజీ గ్రౌండ్…4-మెటర్నటి హాస్పిటల్ కి ఏదురుగా ఉన్న నెహ్రూ మున్సిపల్ స్కూల్ గ్రౌండ్. ప్రజలు భక్తులు పై విషయాన్ని గమనించి ద్విచక్ర వాహనాల ను పార్కింగ్ చేయవలసినదిగా పోలీసలు విజ్ఞప్తి చేశారు.

 

Spread the love
venkat seelam

Recent Posts

122 సంవత్సరాల తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు

అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్‌లో వడగాలులు…

2 hours ago

దక్షిణ చైనాలో కుప్పకూలిన వంతెనలో కొంత భాగం-19 మంది మృతి

అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…

22 hours ago

నెల్లూరు పార్లమెంటుకు 14 మంది-అసెంబ్లీలకు 115 మంది అభ్యర్థులు-కలెక్టర్‌

మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…

2 days ago

ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన ఎన్డీఏ కూటమి

అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…

2 days ago

మే 2 నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం- జనరల్ అబ్జర్వర్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…

2 days ago

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎదురు కాల్పులు-7 మావోయిస్టులు హతం

అమరావతి: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో పోలీసుల‌కు, మావోయిస్టుల‌కు మ‌ధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హ‌త‌మ‌య్యారు.. నారాయ‌ణ్‌పూర్‌, కాంకేర్…

2 days ago

This website uses cookies.