NATIONAL

అంతరిక్ష రంగంలో భారత్ దూసుకుని పోతుంది-ప్రధాని మోదీ

మన్ కీ బాత్..

అమరావతి: అంతరిక్ష రంగంలో దూసుకుని పోతుందన్నఆసూయతో, క్రయోజెనిక్ రాకెట్ టెక్నాలజీని మన దేశానికి ఇచ్చేందుకు అగ్రరాజ్యం ఆంక్షలు విధించిందని, ఆయితే ఇలాంటి పరిస్థితులను భారతీయ శాస్త్రవేత్తలు సవాల్ గా తీసుకుని, మన దేశంలోనే అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివ‌ృద్ధి చేశారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధాని మోదీ నిర్వహించే ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పదేళ్ళ క్రితం ఇస్రో సాధించిన ఘన విజయాన్ని గుర్తు చేశారు.నేడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) డజన్లకొద్దీ ఉపగ్రహాలను రోదసిలోకి పంపిస్తోందని చెప్పారు. ఇస్రో పదేళ్ళ క్రితం జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (GSLV) ప్రాజెక్టును విజయవంతం చేసిందన్నారు. క్రయోజెనిక్ ఇంజిన్‌తో GSLV-D5ను విజయవంతంగా ప్రయోగించిందని వెల్లడించారు. అంతకుముందు దశాబ్దాలపాటు మన దేశంపై అమెరికా పుణ్యామ అంటూ, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ (MTCR) ఆంక్షలు అమలవుతూ ఉండేవన్నారు. దీపావళికి ముందు 36 కమ్యూనికేషన్ శాటిలైట్స్‌ ను ఇస్రో విజయవంతంగా కక్ష్యలలోకి ప్రవేశపెట్టింది. ఇస్రో ఇటీవల విజయవంతంగా ఉపగ్రహాలను పంపించడంతో అంతర్జాతీయ వాణిజ్య విపణిలో భారత దేశం బలమైన పోటీదారుగా నిలిచిందని చెప్పారు.మరో 36 బ్రాడ్‌బ్యాండ్ ఉపగ్రహాలను త్వరలోనే ప్రయోగించబోతోందని ప్రపంచం అంత నేడు భారత్ వైపు చూస్తుందని చెప్పారు.

Spread the love
venkat seelam

Recent Posts

వాటర్ ప్యాకెట్లపై తయారీ, ఎక్స్ పెయిరీ తేదీలు లేకపోతే క్రిమినల్ కేసులే-MHO వెంకట రమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…

3 hours ago

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

1 day ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

1 day ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

2 days ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

2 days ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

2 days ago

This website uses cookies.