NATIONAL

శత్రువులు కనీసం ఊహించలేని ఆయుధాలు మన సైనికుల వద్ద ఉన్నాయి-ప్రధాని మోదీ

అమరావతి: దేశ సరిహాద్దుల వద్ద పక్కలో బల్లెంలా వున్న శత్రువులు కనీసం ఊహించలేని ఆయుధాలు మన సైనికుల వద్ద ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు..సోమవారం ఢిల్లీలో భారత నావికా దళం ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్న సందర్భంలో మన సైనిక శక్తిని ప్రశంసించారు.. 2014లో బాధ్యతలు చేపట్టిన తరువాత తీసుకున్న నిర్ణయం “ఆత్మనిర్భర్ భారత్ “ మన రక్షణ రంగానికి ఎన్నో ప్రయోజనలు కల్పిస్తూనే వుందన్నారు..‘‘ఒకప్పుడు మనం చిన్నచిన్న విషయాలకు కూడా విదేశాలపై ఆధారపడే వాళ్లమని,,ఎంతలా అంటే, డ్రగ్స్‌ కు అలవాటు పడినట్లుగా మనం విదేశాల నుంచి రక్షణ రంగ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి అలవాటు పడిపోయమని గుర్తు చేశారు…దీన్ని దృష్టిలో పెట్టుకుని, గతాన్ని పరిశీలించి,, రక్షణ రంగంలో ఆత్మనిర్భరతపై దృష్టి పెట్టామన్నారు..వచ్చే ఏడాది ఆగష్టు 15 నాటికి 75 దేశీయ సాంకేతికతల్ని నేవీకి అందించబోతున్నమని తెలిపారు.. 100 సంవత్సరాల స్వాతంత్ర్య భారతంలో ఉత్సవాల నాటికి,,దేశీయ రక్షణ రంగాన్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాలనేది మా లక్ష్యంమని పేర్కొన్నారు.. ప్రపంచంలో అన్ని దేశాల వద్ద ఉన్న ఆయుధాలతోనే,,మేం మా సైన్యాన్ని యుద్ధంలోకి పంపించేది లేదని,,న్యూ ఇండియా అలాంటి రిస్క్ తీసుకోదన్నారు.. కనీసం శత్రువులు ఊహించలేని ఆయుధాలు మా సైన్యం దగ్గర ఉన్నాయని తెలిపారు..కేంద్రం తీసుకున్న చర్యల వల్ల రక్షణ రంగ దిగుమతులు 21 శాతం తగ్గడంతో పాటు ఇదే సమయలో ఎగుమతి చేసే స్థాయికి వచ్చాం’’ అని ప్రధాని మోదీ అన్నారు..

Spread the love
venkat seelam

Recent Posts

జగన్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిపోయింది-షర్మిలా

నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…

8 mins ago

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

3 hours ago

డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదలీ వేటు

అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…

4 hours ago

ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ కు 8వ తేదీ వరకు ఓటింగ్‌కు అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్‌ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ…

4 hours ago

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

1 day ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

1 day ago

This website uses cookies.