శత్రువులు కనీసం ఊహించలేని ఆయుధాలు మన సైనికుల వద్ద ఉన్నాయి-ప్రధాని మోదీ

అమరావతి: దేశ సరిహాద్దుల వద్ద పక్కలో బల్లెంలా వున్న శత్రువులు కనీసం ఊహించలేని ఆయుధాలు మన సైనికుల వద్ద ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు..సోమవారం ఢిల్లీలో భారత నావికా దళం ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్న సందర్భంలో మన సైనిక శక్తిని ప్రశంసించారు.. 2014లో బాధ్యతలు చేపట్టిన తరువాత తీసుకున్న నిర్ణయం “ఆత్మనిర్భర్ భారత్ “ మన రక్షణ రంగానికి ఎన్నో ప్రయోజనలు కల్పిస్తూనే వుందన్నారు..‘‘ఒకప్పుడు మనం చిన్నచిన్న విషయాలకు కూడా విదేశాలపై ఆధారపడే వాళ్లమని,,ఎంతలా అంటే, డ్రగ్స్ కు అలవాటు పడినట్లుగా మనం విదేశాల నుంచి రక్షణ రంగ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి అలవాటు పడిపోయమని గుర్తు చేశారు…దీన్ని దృష్టిలో పెట్టుకుని, గతాన్ని పరిశీలించి,, రక్షణ రంగంలో ఆత్మనిర్భరతపై దృష్టి పెట్టామన్నారు..వచ్చే ఏడాది ఆగష్టు 15 నాటికి 75 దేశీయ సాంకేతికతల్ని నేవీకి అందించబోతున్నమని తెలిపారు.. 100 సంవత్సరాల స్వాతంత్ర్య భారతంలో ఉత్సవాల నాటికి,,దేశీయ రక్షణ రంగాన్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాలనేది మా లక్ష్యంమని పేర్కొన్నారు.. ప్రపంచంలో అన్ని దేశాల వద్ద ఉన్న ఆయుధాలతోనే,,మేం మా సైన్యాన్ని యుద్ధంలోకి పంపించేది లేదని,,న్యూ ఇండియా అలాంటి రిస్క్ తీసుకోదన్నారు.. కనీసం శత్రువులు ఊహించలేని ఆయుధాలు మా సైన్యం దగ్గర ఉన్నాయని తెలిపారు..కేంద్రం తీసుకున్న చర్యల వల్ల రక్షణ రంగ దిగుమతులు 21 శాతం తగ్గడంతో పాటు ఇదే సమయలో ఎగుమతి చేసే స్థాయికి వచ్చాం’’ అని ప్రధాని మోదీ అన్నారు..