DEVOTIONAL

శ్రీవారి ఆస్తుల విలువ రూ.85,705 వేల కోట్లు-టీటీడీ ఛైర్మన్

తిరుమల: టిటిడి ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేయడం జరిగిందని టిటిడి ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి ప్రకటించారు..శనివారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో నిర్వహించిన పాలక మండలి‌ సమావేశంలో పలు‌కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నాంమని, కోవిడ్ కారణంగా రెండేళ్ల తరువాత భక్తుల సమక్షంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు..టీటీడీకి సంభందించిన 960 స్థిర ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయడం జరిగిందని, ఆస్తుల విలువ రూ.85,705 వేల కోట్లు ఉంటుందని ఆయన ప్రకటించారు..

తిరుమలలోని గదుల్లో గీజర్ లు:- ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 12 రకాల పంటలను కొనుగోలు చేసేందుకు రైతు సాధికార సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందన్న ఆయన, తిరుమలలో సామన్య భక్తులకు వసతి సదుపాయం పెంపుపై నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆయన తెలియజేశారు.. గోవర్థన సత్రాల వెనుక భాగంలో 95 కోట్లతో పీఏసి-5 నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాంమని, వకూళమాత ఆలయం నుండి జూపార్క్ వరకు 30 కోట్లతో కనెక్టివిటీ రింగ్ రోడ్డును నిర్మించాలని నిర్ణయించడం జరిగిందన్నారు..తిరుమలలోని గదుల్లో గీజర్ లు ఏర్పాటుకు రూ 7 కోట్ల 20 లక్షల నిధులు మంజూరు చేసేందుకు చర్చించి నిర్ణయించుకున్నామని, ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో క్లాస్ రూమ్స్, హాస్టల్ అభివృద్ధికి 6 కోట్లు 20 లక్షల నిధులు మంజూరు చేసాంమని,టీటీడీ ఉద్యోగుల ఇంటి స్థలాల కోసం 300 ఎకరాలు ప్రభుత్వం నుండి ఇదివరకే కొనుగోలు చేసాంమని, భవిష్యత్తు అవసరాల కోసం 25 కోట్లతో మరో 130 ఎకరాలు కొనుగోలు చేయాలని తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు..

టిక్కెట్లు లేక పోయినా భక్తులను సర్వదర్శనం:- టైం స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ పునరుద్ధరణ చేసి పెరటాసి మాసం అనంతరం తిరుపతిలో భక్తులకు సర్వదర్శనం టోకన్లు జారీ  పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.. ఎలాంటి టోకన్లు, టిక్కెట్లు లేక పోయినా భక్తులను సర్వదర్శనం అనుమతించే విధానం యధావిధిగా కొనసాగుతుందన్నారు.. విఐపీ బ్రేక్ దర్శనాల సమయంలో మార్పులు చేయాలని బోర్డు కీలక నిర్ణయం తీసుకుందని, ఉదయం 10 గంటల తరువాత విఐపీ బ్రేక్  దర్శనాలు ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.. పూర్తి స్ధాయిలో బ్రేక్ దర్శనాలపై ప్రయోగాత్మకంగా పరిశీలించిన తరువాత అమలు చేస్తాంమని ఆయన అన్నారు.. వసతి కేటాయింపు ప్రక్రియను పూర్తిగా తిరుపతి నగరానికి మార్పు చేయాలని యోచనలో ఉన్నాంమని, బ్రహ్మోత్సవాల అనంతరం ప్రయోగత్మక పరిశీలన అనంతరం గదులు కరెంట్ బుకింగ్ విధానం తిరుపతికి తరలించాలని నిర్ణయం తీసుకుంటాంమని టిటిడి ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి తెలియజేశారు.

శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల‌ ఏర్పాట్లపై ఈవో సమీక్ష:- శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలకు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండ‌డంతో విభాగాల వారీగా చేప‌ట్టిన ఏర్పాట్ల‌పై టిటిడి ఈవో ఎవి ధర్మారెడ్డి సమీక్షించారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం ఈ సమీక్ష జ‌రిగింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ రెండేళ్ల తర్వాత మాడ వీధుల్లో భ‌క్తుల స‌మ‌క్షంలో వాహ‌న‌సేవ‌లు జ‌రుగ‌నున్నాయ‌ని, ప్రతి ఉద్యోగీ బాధ్యతగా తమ విధులు నిర్వ‌హించాల‌ని కోరారు. విశేషంగా భ‌క్తులు విచ్చేసే అవ‌కాశం ఉండ‌డంతో ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని, అక్టోబర్ 1న గరుడ సేవ నాడు మ‌రింత అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు.

Spread the love
venkat seelam

Recent Posts

వైసీపీని బంగళాఖతంలో కలిపేందుకు సింహపురి ప్రజలు సిద్దమేనా-బాబు,పవన్

నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…

5 hours ago

నా కుమారై, నన్ను వ్యతిరేకించడమా ? ముద్రగడ పద్మనాభరెడ్డి

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…

10 hours ago

వయనాడ్‌లో ఓడిపోతే ? రాయ్‌బరేలి నుంచి బరిలోకి దిగిన రాహుల్‌ గాంధీ

అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్‌లోని అమేథి, రాయ్‌బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థులపై కొనసాగుతున్న…

11 hours ago

వైసీపీ ఎం.పీలు,ఎమ్మేల్యేలు జగన్ కాలి క్రింద చెప్పులే-అంబటి

అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…

1 day ago

122 సంవత్సరాల తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు

అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్‌లో వడగాలులు…

2 days ago

దక్షిణ చైనాలో కుప్పకూలిన వంతెనలో కొంత భాగం-19 మంది మృతి

అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…

2 days ago

This website uses cookies.