CRIME

SBI Bankకు సొరంగం త్రవ్వి రూ.కోటి విలువై బంగారం పట్టుకెళ్లిన దొంగలు

అమరావతి: ఉత్తర ప్రదేశ్‌లో బ్యాంకులోకి సొరంగం ద్వారా ప్రవేశించి రూ.కోటి విలువైన బంగారం ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్, కాన్పూర్‌లోని SBI Bank భానూతి బ్రాంచ్ చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి… భానూతి బ్రాంచ్ ప్రక్కనే వున్న ఖాళీ స్థలం నుంచి దొంగలు బ్యాంకులోకి దాదాపు 10 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో సొరంగం తవ్వి,,ఈ సొరంగం నుంచి బ్యాంక్ ఫ్లోర్ పగులగొట్టి,, బ్యాంకులోకి ప్రవేశించారు..స్ట్రాంగ్ రూమ్ లోని బీరువాల్లో వున్న రూ.1 కోటి విలువైన 1.8 కేజీల బంగారం ఎత్తుకెళ్లారు..క్యాష్ ఉన్న లాకర్స్ ను పగలగొట్టేందుకు కూడా ప్రయత్నించినట్లు ఆధారలు దొరికాయి..అయితే ఇది సాధ్యం కాలేదు..ఈ దొంగతనం గురువారం అర్ధరాత్రి తర్వాత జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు..శుక్రవారం ఉదయం బ్యాంకుకు వచ్చి సిబ్బంది,,రూమ్ లోకి వెళ్లే సరికి దొంగతనం జరిగినట్లు గుర్తించారు..వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.,బ్యాంకులో ఎంత బంగారం చోరీకి గురైంది,, దాని విలువెంత అని తెలుసుకోవడానికి సిబ్బందికి ఒక రోజు సమయం పట్టింది..దొంగలు పట్టుకెళ్లిన బంగారం 29 మంది కస్టమర్లకు సంబంధించిందని,, బంగారం తాకట్టుపెట్టి రుణాలు తీసుకున్నారని బ్యాంక్ మేనేజర్ తెలిపారు..కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు..దొంగతనం జరిగిన తీరు గమిస్తే,, బ్యాంకు గురించి పూర్తిగా తెలిసినటువంటి వాళ్లే ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు..ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు,, స్ట్రాంగ్ రూమ్ నుంచి సేకరించిన వేలి ముద్రల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు..

Spread the love
venkat seelam

Recent Posts

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

1 hour ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

2 hours ago

అభ్యర్థులకు ఓటర్ల జాబితా పంపిణీ చేసిన వికాస్ మర్మత్

నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర  అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…

5 hours ago

పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకోనున్న20 వేల మందికి పైగా ఉద్యోగులు-కలెక్టర్

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…

5 hours ago

బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా ఆఫ్ఘనిస్థాన్ అంబాసిడర్

అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…

6 hours ago

వైసీపీని బంగళాఖతంలో కలిపేందుకు సింహపురి ప్రజలు సిద్దమేనా-బాబు,పవన్

నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…

1 day ago

This website uses cookies.