AMARAVATHINATIONAL

122 సంవత్సరాల తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు

అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్‌లో వడగాలులు కొనసాగగా,, మే నెలలోనూ అంతకు మించి ఎండలు, వడగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలియచేసింది..రెండు రోజుల నుంచి చాలా ప్రాంతాల్లో ఉష్ణోగత్రలు మరింత పెరిగాయని,,మరో 11 రోజుల పాటు వడగాలులు వీచే అవకాశాలున్నాయని అంచనా వేసింది..2023 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డులకెక్కింది..భారత వాతావరణ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ మృత్యంజయ్‌ మోహపాత్ర మాట్లాడుతూ ఏప్రిల్‌ నెల మొత్తం దాదాపుగా వడగాలులు వీచినట్లు తెలిపారు.. సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా నమోదైందని తెలిపారు. ఏప్రిల్‌ నెలలో తూర్పు, ఈశాన్య భారతంలో సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత 28.12 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని పేర్కొన్నారు.. 1901 తరువాత సదరు ప్రాంతాల్లో ఏప్రిల్‌ నెలలో ఈ స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదవడం ఇదే తొలిసారన్నారు.. 1980 నుంచి దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడం సాధారణంగా మారాయన్నారు.. దక్షిణ రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడా, గుజరాత్ ప్రాంతాల్లో మేలో 8-11 రోజుల పాటు వేడి గాలులు ఉండవచ్చని వెల్లడించారు..ఏప్రిల్‌లో ఎండలకు ప్రధాన కారణం ఉరుములతో కూడిన వర్షాలు లేకపోవడమేనని పేర్కొన్నారు..మే నెలలో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు..వాయువ్య,,మధ్య భారతం కొన్ని ప్రాంతాలు,,ఈశాన్య భారతదేశంలోని చాలా ప్రాంతాలు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురిసే అవకాశం ఉన్నదని తెలిపారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *