INTERNATIONAL

ప్రధాని నరేంద్ర మోడీ పాదాభివందనం చేసిన పపువా న్యూ గినియా ప్రదాని

అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ పట్ల గౌరవం రోజు రోజుకు పెరుగుతొంది అనేందుకు నేడు చేసుకున్న సంఘటన ఒక ఉదహరణ…..జపాన్‌లో జరిగిన G-7 సదస్సులో పాల్గొన్న అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా (ఆదివారం) పపువా న్యూ గినియాకు చేరుకున్నారు..ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ ప్రధాని జేమ్స్ మరాపే ఘన స్వాగతం పలికారు.. విమానం దిగి వచ్చిన ప్రధాని మోడీ పాదాలకు మరాపే నమస్కరించారు..వెంటనే మోడీ ఆయన్ను పైకి లేపి భూజాన్ని తట్టి కౌగిలించుకున్నారు.. అనంతరం ప్రధాని మోడీకి ఆ దేశ అధికారులను స్వయంగా పరిచయం చేశారు..పపువా న్యూ గినియాను సందర్శించిన భారతదేశ తొలి ప్రధాని నరేంద్ర మోడీ కావడం విశేషం..

పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఈ ద్వీప దేశం సూర్యాస్తమయం తరువాత ప్రభుత్వ గౌరవాలతో విదేశీ అతిథులను స్వాగతించదు.. ఇందుకు మినహయింపుగా ప్రధాని మోడీ కోసం ఈ దేశం తన సంప్రదాయాన్ని ప్రక్కకు పెట్టింది.. భారతదేశం యొక్క ప్రాముఖ్యత, ప్రపంచ వేదికపై ప్రధాని మోడీకి పెరుగుతున్న విశ్వసనీయతను పరిగణనలోకి తీసుకుని, అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాల సమాచారం..ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ కార్పొరేషన్ (FIPIC) సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ పపువా న్యూ గినియాకు చేరుకున్నారు..ఈ సమావేశంలో 14 దేశాల నేతలు పాల్గొంటారు..పపువా న్యూ గినియా పర్యాటన అనంతరం ప్రధాని మోడీ ఇక్కడి నుంచి నేరుగా ఆస్ట్రేలియా వెళ్లనున్నారు..పాపువా న్యూ గినియాలో ప్రవాస భారతీయులు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు..వారు ఉత్సహంగా ప్రధాని మోడీతో సెల్ఫీలు దిగుతూ కనిపించారు.

Spread the love
venkat seelam

Recent Posts

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

16 hours ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

16 hours ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

2 days ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

2 days ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

2 days ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

2 days ago

This website uses cookies.