AMARAVATHIDISTRICTS

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు స్వాధీనం-ఉపరవాణ కమిషనర్ చందర్

నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వానికి త్రైమాసిక పనులు చెల్లించకుండా బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తున్న నాలుగు ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలను గుర్తించి,, గురువారం వేకువజామున సదరు వాహనాలపై తనిఖీ రసీదులు నమోదు చేసి వాహనాలను  స్వాధీనపరచుకొవడం జరిగిందని ఉపరవాణ కమిషనర్ చందర్ పేర్కొన్నారు.. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా త్రై మాసిక పన్ను చెల్లించకుండానే ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలు తిరగడం పట్ల రవాణా శాఖ తీవ్రమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించిందన్నారు..జాతీయ రహదారిలో ఇతర వాహనాల డ్రైవర్ల కళ్ళకు ఇబ్బంది కలిగేలా మిరుమిట్లు గొలిపే కాంతివంతమైన లైట్లు కలిగిన వాహనాలపై ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ పై పది కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు..అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అనధికార సరుకు రవాణా ( commercial goods transportation) చేస్తున్న పది వాహనాలపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు..ఈ వాహనాలపై 30 లక్షల రూపాయల పన్ను,,పెనాల్టీ వసూలు కావలసి ఉందని కమిషనర్ తెలియజేశారు..ఈ తనిఖీలలో మోటార్ వాహన తనిఖీ అధికారులు బాలమురళీకృష్ణ, గోపి నాయక్, రాంబాబు, సుందర్ రావు,కార్తీక్ పవన్, పూర్ణచంద్రరావు,స్వప్నిల్ రెడ్డి పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *